లండన్‌లో బాలకిషన్ ధూంధాం

కార్యక్రమాన్ని తెలంగాణా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి ప్రారంబించారు తరువాత ఎన్నారై టిఆర్ఎఎస్ సెల్ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు చేపట్టిన వివిధల రకాల కార్యక్రమాలని ఒక వీడియో ద్వారా ప్రదర్శించారు. ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ - తెలంగాణ ఉద్యమంలో, టి.ఆర్.యస్ పార్టీ ఆవిర్భావంలో వి.ప్రకాష్ పాత్ర వెలకట్టలేనిదని వారి సేవలని తెలంగాణ ప్రజలు ఎప్పటికి మరిచి పోలేరని, ఎప్పటికి వారు చరిత్రలో నిలుస్తారని తెలిపారు.
అలాగే రసమయి బాలకిషన్ తమ ఆట పాటతో యావత్ తెలంగాణ ప్రజలను చైతన్య పరిచే విధానాన్ని వారు అభినందించారు. లండన్ వరకు వచ్చి ఆశీర్వదించినందుకు వారికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దుకుంటామని తెలిపారు, తరువాత వారిని జ్ఞాపిక తో సన్మానించారు.
వి.ప్రకాష్ గారు మాట్లాడుతూ- ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ గత మూడేళ్లుగా నిరంతరం తెలంగాణ రాష్ట్ర సాధనకోసం, అలాగే తెలంగాణ ప్రజల సంక్షేమ కోసం చేస్తున్న సేవలు చాల గొప్పగా ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఎంతో స్పూర్తిని ఇస్తున్నాయని తెలిపారు. తరువాత టి.ఆర్.యస్ ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమ సుదీర్ఘ ప్రయాణం నేటి పరిస్తులని చక్కగా వివరించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కాయమని వచ్చిన తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రవాస తెలంగాణ తమ పాత్ర పోషించాలని కోరారు.
రసమయి బాలకిషన్ టి.ఆర్.యస్ పార్టీ తో వారికి ఉన్న అనుబంధాన్ని, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ కృషిని వివరిస్తూ తమ ఆటపాటలతో ప్రవాస తెలంగాణ బిడ్డలను అలరించారు.ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ గత మూడేళ్లుగా చేస్తున్న కార్యక్రమాలని అభినందించారు.
తెలంగాణా ఎన్నారై ఫోరం వ్యవాస్థాపక సభ్యులు గంప వేణుగోపాల్ మాట్లాడుతూ - కేవలం లండన్‌లో మాత్రమే తెలంగాణ స్పూర్తి ఈ స్థాయిలో ఉండడానికి కారణం కేవలం ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ మాత్రమేనని, తెలంగాణా ఎన్నారై ఫోరం ఆవిర్భావం కూడా వారి కృషి తో సాద్యం అయిందని తెలిపారు, టి.జాక్ చైర్మన్ కోదండరాం గారి ఆద్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ కచితంగా తెలంగాణ అనుకూల రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తుందని, వి.ప్రకాష్ గారు, రసమయి బాలకిషన్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనకు చేస్తున్న కృషిని అభినందించారు.
హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ మాత్రమే ప్రకటించాలని, ఇంకా వేరే ఏది కూడా తెలంగాణ ప్రజలు ఆమోదించరని ఏక వాక్య తీర్మానం చేసారు, దేన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక పేటిషన్ రూపం లో సమర్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్యస్ సెల్ లండన్ ఇంచార్జ్ శ్రీకాంత్ పెద్దిరాజు, సంయుక్త కార్యదర్శులు సిక్క చందు గౌడ్, అశోక్ దూసరి, అడ్వైజరీ బోర్డు సబ్యులు విష్ణువర్ధన్ రెడ్డి,వెస్ట్ లండన్ ఇంచార్జ్ అబుజార్ మొహమ్మద్,ఇతర కోర్ కమిటి సబ్యులు హరికృష్ణ,ప్రశాంత్ రెడ్డి, రోహిత్ రావు, సంతోష్, మహేష్, వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి,మల్లేష్,జితేందర్,చక్రి, కిరణ్ విష్ణుముకుల్ల అలాగే తెనా ప్రతినిథులు ఉదయ నాగరాజు, ప్రమోద్ అంతటి, శివాజీ షిండే, నవీన్ రెడ్డి, శ్రీనాథ్ రావు, ప్రవీణ్ రెడ్డి, రంగు వెంకట్, జయశంకర్ ఆర్&డి ప్రతినిథి నిశాంత్ డోంగరి, సృజన్ పాల్గొన్న వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications