వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమోషన్ నో: తప్పుకున్న అధికారి

By Pratap
|
Google Oneindia TeluguNews

British Flag
లండన్: తనకు ప్రమోషన్ నిరాకరించడంతో బ్రిటన్‌లోని భారత సంతతి పోలీసు అధికారి ఒకరు ముందస్తుగా పదవీవిరమణ చేశారు. దాల్ బాబు (49) గుజరాతీలో ఎక్కువగా ఉండే లండన్ శివారులోని హారోలో చీఫ్ సూపరింటిండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనను స్ట్రాటజిక్ కమాండ్ కోర్సు (ఎస్‌సిసి)లోకి తీసుకోవడానికి 2011లో నిరాకరించారు. ప్రాంతీయ చీఫ్ కానిస్టేబుల్స్‌ను లేదా లండన్లోని పోలీసు కమిషనర్‌ను తయారు చేయడానికి ఇది పనిచేస్తుంది.

మీడియా ఇంటర్వ్యూ నైపుణ్యాలు సరిగా లేకపోవడం వల్లనే దాంట్లోకి దాల్ బాబును తీసుకోలేదని బ్రిటిష్ వార్తాపత్రికలు రాశాయి. జాతిపరమైన మైనారిటీల పట్ల వివక్ష చూపుతున్నారని, తాము జాతిపరమైన మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేవలందిస్తామని, పోలీసు ఫోర్సులో ఎక్కువగా వైట్స్ ఉన్నారని బాబు అన్నట్లు గార్డియన్ వెబ్‌సైట్ వ్యాఖ్యానించింది.

బాబు ప్రమోషన్ నిరాకరణకు గురైనట్లు, విశ్వాసం కారణంగా తన పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నట్లు ఆరోపిస్తూ లండన్ మెట్రోపాలిటన్ పోలీసు సర్వీస్ (ఎంపిఎస్)పై వేసిన కేసును బాబు 2003లో గెలిచారు.

బాబు రాజీనామా చేయేలదని, కానీ పోలీసు ఆఫీసర్‌గా 30 ఏళ్లు పనిచేసిన తర్వాత అందుబాటులో ఉండే పదవీ విరమణ ప్రత్యామ్నాయాన్ని వాడుకున్నారని, తగిన ప్రయోజనాలతో సర్వీసు రూల్స్ అందుకు అనుమతిస్తాయని లండన్ మెట్రోపాలిటన్ పోలీసు సర్వీస్ స్కాట్లాండ్ యార్డ్ కేంద్ర కార్యాలయం అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు.

English summary
An Indian-origin police officer in Britain on Monday took early retirement after he was rejected for further promotion in his career.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X