వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సంతతి ఇంజనీర్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Indian-origin engineer arrested for stealing trade secrets
వాషింగ్టన్: తాను ఇంతకు ముందు పనిచేసిన సంస్థ నుంచి వాణిజ్య రహస్యాలను దొంగిలించాడనే ఆరోపణపై ఫెడరల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) భారత సంతతి ఇంజనీర్‌ను అరెస్టు చేసిది. బెక్టన్, డికిన్సన్ అండ్ కంపెనీ (బిడి) అనే గ్లోబల్ మెడికటల్ టెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేసిన ఉత్పత్తుల వాణిజ్య రహస్యాలను న్యూజెర్సీలోని కేతన్ కుమార్ మనేర్ (36) అనే ఇంజనీర్ దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చాయి.

మనేర్‌ను న్యూజెర్సీలోని రామ్సే హోటల్ల్ో అరెస్టు చేసినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తెలిపింది. బిడి ఫ్రాంక్లిన్ లేక్స్ కేంద్ర కార్యాలయంలో మనేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండేవాడు. అక్కడ ప్రిఫిల్లేబుల్ సినర్జీలను, పెన్ ఇంజెక్టర్లను తయారు చేస్తుంటారు. వాటికి సంబంధించిన వాణిజ్య రహస్యాలను మనేర్ సేకరించినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు మార్కెట్లోకి విడుదల చేయని ఉత్పత్తుల రహస్యాలను మనేర్ దొంగిలించాడని ఆరోపిస్తున్నారు.

మనేర్ దాదాపు 8 వేల ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకున్నాడని, ఆ ఫైళ్లలో అత్యంత విలువైన సమాచారం ఉందని అంటున్నారు. తన రాజీనామాకు ముందు ఆతను ఈ పనిచేసినట్లు చెబుతున్నారు. జ్వరంతో బాధపడుతున్నానని చెప్పి ఇంట్లో ఉండి అతను అందుకు ఒడిగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

మనేర్ ఉన్న హోటల్ గదిపై దాడి చేసి కంప్యూటర్లను, కంప్యూటర్ స్టోరేజీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే వరకు అతను జైలులోనే ఉంటాడు.

English summary
An Indian-origin engineer has been arrested by the Federal Bureau of Investigation (FBI) for allegedly stealing trade secrets from his former employer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X