మలేసియాలో ఎన్నారై కాల్పివేత

ఈ ఘటనలో ఎన్నారై ఎమ్ రవీంద్రన్1(9) ప్రాణాలు కోల్పోయాడు. 51 ఏళ్లు, 18 ఏళ్ల వయసున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఎస్ లీనేష్ (18), ఎ సుకుమార్ (52)గా గుర్తించారు.. మోటార్ బైక్‌పై వచ్చిన దండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
వర్షం కురుస్తుండడంతో బాధితులు నిరీక్షస్తుండగా వారిపై దాడి జరిగింది. దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఆరు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రవీంద్రన్ శరీరం ఎడమ భాగంలో మూడు బుల్లెట్లు తగిలినట్లు అధికార వర్గాలు చెప్పాయి. సెబరంగ జయ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దుండగులు కాల్పులు జరపడానికి గల కారణమేమిటనేది తెలియడం లేదు. రవీంద్రన్ పంటాయి బెర్సిస్ ఫ్లాట్స్‌లో ఉంటున్నాడని, నిరుద్యోగి అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications