సింగపూర్‌లో జయశంకర్ వర్ధంతి

Singapore: Telangana spoorthy sabha in memory of Jaishankar
సింగపూర్: ఎన్నారై టిఆర్ఎస్ సెల్ - సింగపూర్ శాఖ ఆధ్వర్యం లో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ రెండవ వర్ధంతి సందర్భంగా "తెలంగాణా స్పూర్తి సభ" ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సింగపూర్ నలుమూలల నుండి తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కార్యకర్తలు వచ్చారు.

ముందుగా జయశంకర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి, తరువాత కొవొత్తులతో తెలంగాణ అమరవీరులను, జయశంకర్‌ను స్మరిస్తూ రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత ఎన్నారై టిఆర్ఎస్ సింగపూర్ కోఆర్డినేటర్ కాంతి రమేష్ మాట్లాడారు. తెలంగాణ భావజాల వ్యాప్తిలో, ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర చాలా మహత్తరమైందని ఆయన అన్నారు. జయశంకర్ చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పని చేశారని, తెలంగాణ రాష్ట్ర సాధనే జయశంకర్‌కు నిజమైన నివాళి అని అన్నారు.

గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ బినామీ ఓ టీవీ చానెల్ తెరాస నాయకుడు, నాయకుడు సిరిసిల్ల ఎమ్మల్యే కెటి రామారావుపై మీద చేస్తున్న అసత్య ఆరోపణలు చేస్తోందని, చంద్రబాబు ఇటువంటి చిల్లర రాజకీయాలు ఎన్ని చేసిన ప్రజలు నమ్మరని, యావత్ తెలంగాణ ప్రజల అండదండలు తెరాసకు ఉన్నాయని తెలిపారు.

ఎన్నారై టిఆర్ఎస్ సింగపూర్ కోఆర్డినేటర్ కాంతి రమేష్‌తో పాటు సభ్యులు నీలి రాములు, బొగ గౌతం, శ్రీను, లోలపు దేవేందర్, కాంతయ్య, శివ, మహిపాల్ రెడ్డి, అనిల్, సాగర్, బాలురెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+