అమెరికాలో స్వాతంత్ర్య వేడుకలు

దాదాపు 30 బే ఏరియా భారత సంఘాలతో కూడిన ఇండో అమెరికన్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ఆధ్వర్వంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఏ మేలా జరిగింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రతిబింబిస్తూ ప్రదర్శన జరిగింది. రాష్ట్రాల సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబించే 15 ఫ్లేట్స్‌ను ప్రదర్శించారు. తెలంగాణ ఫ్లోట్‌ను కాకతీయ తోరణంతో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
కాకతీయ తోరణంతో పాటు భారీ బతుకమ్మను కూడా ప్రదర్శించారు. ఫ్లోట్‌ను చార్మినార్, గోల్కొండ కోట, బోనం, భారత, తెలంగాణ చిత్రాలతో అలంకరించారు. వేలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, మాతరం... మాతరం వందేమాతరం, జై జై తెలంగాణ తల్లి, జై హింద్ వంటి నినాదాలు చేశారు.
తెలంగాణ ఫ్లోట్‌ను తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం, తెలంగాణ సాంస్కృతిక సంఘం (టిసిఎ) వంటి సంస్థల కార్యకర్తలు, స్థానిక వాలంటీర్లు కలిసి రూపొందించారు. తెలంగాణ తల్లిని ఫ్లోట్‌పై చిత్రించారు.












Click it and Unblock the Notifications