వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్‌లో తెరాస వేడుకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
సింగపూర్: ఎన్నారై తెరాస విభాగం సింగపూర్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 12 వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ సింగపూర్ కోఆర్డినేటర్ కంతి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్ నలుమూలల నుండి తెరాస కార్యకర్తలు, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.

ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన బిడ్డలకు రెండు నిమిషాలు మౌనం పాటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ సింగపూర్ కోఆర్డినేటర్ కంతి రమేష్ మాట్లాడుతూ - తెరాస అధినేత కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషిస్తూనే, స్వీయ రాజకీయ శక్తిగా ఎదగడానికి తమ వంతు కృషి చేస్తామని, 2014 లక్ష్యంగా 100 మంది శాసనసభ్యులు , 15 పార్లమెంటు సభ్యులు గెలిచుకునేలా చేసి, తెలంగాణ సాదించే విధంగా ముందుకు వెళ్తామని తెలిపారు.

తెలంగాణా నుండి తెరాస పోలిట్బ్యూరో సభ్యుడు టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ - ఖండాంతరాల్లో ఉంటూ, తెలంగాణ కోసం చేస్తున్న పోరాటాన్ని, కృషిని అభినందించారు. తెరాస పార్టీ మీ సేవలను ఎప్పటికి మర్చిపోదని అన్ని వేళల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా లండన్ నుండి ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ - ముందుగా తెరాస నాయకులకు, కార్యకర్తలకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ విస్తరణకు సహకరిస్తున్న సింగపూర్ తెరాస నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెరాస అధినేత కెసిఆర్ నాయకత్వాన్ని ఇంకా బలపరిచి మనం యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలని, స్వీయ రాజకీయ శక్తి తోనే తెలంగాణా సాధ్యమని తెలిపారు.
తెలంగాణా బిడ్డలంత గర్వపడేలా సింగపూర్ బిడ్డలు పోరాటం చేస్తున్నారని, వీరందరూ చరిత్రలో మిగిలి పోతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ సింగపూర్ కోఆర్డినేటర్ కంతి రమేష్ తో పాటు ఇతర సబ్యులు ఆగుల వినోద్, సామా రమణా రెడ్డి, గుమ్మల శివ, మైపాల్ రెడ్డి, అశోక్, రంజిత, మహేష్, మల్లికార్జున్, సాగర్, రాములు, కాంతయ్య, బాల్ రెడ్డి పాల్గొన్నారు.

English summary

 Singapore TRS cell has organised Telangana Rastra Samithi (TRS) 12th annual celebrations. Several NRIs from Singapore participated in the celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X