భారతీయ అమెరికన్ల హత్య

dead
అమెరికా: గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి భారతీయ అమెరికన్లయిన ఇద్దరు సిక్కు పౌరులపై కాల్పలకు తెగబడ్డారు. కాల్పుల్లో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఇండియానా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అక్కడి సిక్కు కమ్యూనిటీని తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

కాల్పులకు పాల్పడ్డ నిందితుడ్ని ఇండియానా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం మృతులు భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన జగ్తర్ సింగ్ భట్ (55), పవన్ ప్రీత్ సింగ్(20)గా గుర్తించినట్లు తెలిపారు.

ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులలో ఒకర్ని కెవిన్ మోర్‌గా పోలీసులు గుర్తించారు. ఇండియానా రాష్టంలోని ఎల్హర్ట్ నగరం మిడిల్ బరి వీధిలో వ్యాపారం చేసుకుంటున్న జగ్తర్ సింగ్ దగ్గర పవన్ ప్రీత్ పనిచేస్తున్నాడు. జగ్తర్ సింగ్ పంజాబ్‌లోని జలంధర్‌కు చెందినవాడు కాగా పవన్ ప్రీత్ హోషీపూర్ లోని మున్నన్ గ్రామ నివాసి.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నిందితుడు కెవిన్ మోర్ మరొకరితో కలిసి ఎల్హర్ట్‌లోనే నివాసం ఉంటున్నట్లు తెలిసింది. పోలీసులు మరో నిందితుని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దొంగతనం చేయడానికి వచ్చిన నిందితులు అడ్డుకోవడంతోనే జగ్తర్, పవన్‌ల హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి హత్యను ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ కార్యనిర్వహక డైరెక్టర్ సత్నం సింగ్ చహల్ శనివారం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు సిక్కు సమాజాన్ని అభద్రతా భావంలోకి నెట్టివేస్తున్నాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+