వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుఎస్‌లో ‘నెల నెలా తెలుగు వెన్నెల’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని డల్లాస్ నగరంలో స్థానిక హిల్ టాప్ ఇండియన్ రెస్టారెంట్‌లో గత శనివారం జరిగిన టెక్సాస్ 33వ సాహితీ సదస్సు, టాoటెక్స్ 86వ ‘నెలా నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం అహుతులను అలరించాయి. డల్లాస్, హ్యూస్టన్ , ఆస్టిన్, టెంపుల్ ,శాన్ ఆంటోనియో వంటి టెక్సాస్ రాష్ట్ర సాహితీ ప్రియులే కాకుండా భారతదేశం నుండి విచ్చేసిన పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

సింగిరెడ్డి శారద ప్రార్ధనా గీతం అనంతరం కార్యక్రమ సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య సభను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల మరణించిన ప్రపంచం గర్వించదగిన చిత్రకారుడు, తెలుగు సినీ దర్శకుడు సత్తిరాజు లక్ష్మీనారాయణ(బాపు) గురించి ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత ఆహ్వానితులందరూ బాపునకు ఘనంగా నివాళులు అర్పించారు. బాపు, రమణలతో ఉన్న అనుభవాలను, ‘బాపు రమణ గార్లతో నా తీపి గుర్తులు' అన్న పుస్తక విశేషాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా మందపాటి సత్యం మాట్లాడుతూ.. ‘మొట్ట మొదటి టెక్సాస్ సాహితీ సదస్సు 1998 వ సంవత్సరంలో ఆస్టిన్ నగరంలో నిర్వహించాం' అని గుర్తు చేసుకొన్నారు. అది మొదలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెక్సాస్ నగరాలలో నిర్వహించడం, ఈ సారి 33వ సాహితీ సదస్సును డల్లాస్‌లో నిర్వహించడం, ఇలా నిర్విరామంగా మన సాహితీ తోటలో పువ్వులు విరబూయడం మన తెలుగుజాతి గొప్పదనం అని పేర్కొన్నారు.

టాoటెక్స్ ఉత్తరాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి నిర్వహించిన ప్రశ్నా వినోద కార్యక్రమం అత్యంత ఆసక్తిగా సాగింది. పోకల సుమ మాట్లాడుతూ.. ఆడవాళ్ళు సమాజంలో ఎంతో పరిణితి సాధించారు, పురుషులతో సమానంగా అభివృద్ధి చెందారని అన్నారు. మహిళలు మరెంతో గౌరవించబడవలసిన అవసరం ఉందని చెప్పారు. బసాబత్తిన శ్రీనివాసులు "బొమ్మా- బొరుసా " అనే పుస్తకం గురించి ముచ్చటించారు. సి. యన్. సత్యదేవ్ 'గిరీశం లెక్చర్ ' బుచ్చమ్మ అష్టావధానం హాస్య కథానికతో ఎంతో నవ్వించారు. మల్లవరపు అనంత్ "కవిపండితులు వ్రాసిన లేఖలు " అన్న అంశంలో లేఖ చదివి వినిపించి ఆద్యంతం ఆకట్టు కొన్నారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

అమెరికాలోని డల్లాస్ నగరంలో స్థానిక హిల్ టాప్ ఇండియన్ రెస్టారెంట్‌లో గత శనివారంజరిగిన టెక్సాస్ 33వ సాహితీ సదస్సు, టాoటెక్స్ 86వ ‘నెలా నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం అహుతులను అలరించాయి.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

డల్లాస్, హ్యూస్టన్ , ఆస్టిన్, టెంపుల్ ,శాన్ ఆంటోనియో వంటి టెక్సాస్ రాష్ట్ర సాహితీ ప్రియులే కాకుండా భారతదేశం నుండి విచ్చేసిన పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

సింగిరెడ్డి శారద ప్రార్ధనా గీతం అనంతరం కార్యక్రమ సమన్వయకర్తఆదిభట్ల మహేష్ ఆదిత్య సభను ఉద్దేశించి మాట్లాడారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

ఇటీవల మరణించిన ప్రపంచంగర్వించదగిన చిత్రకారుడు, తెలుగుసినీ దర్శకుడు సత్తిరాజు లక్ష్మీనారాయణ(బాపు) గురించి ఆయన ప్రస్తావించారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

ఆ తర్వాత ఆహ్వానితులందరూ బాపునకు ఘనంగా నివాళులు అర్పించారు. బాపు, రమణలతో ఉన్న అనుభవాలను,‘బాపు రమణ గార్లతో నా తీపి గుర్తులు' అన్న పుస్తక విశేషాలు పంచుకున్నారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

ఈ సందర్భంగా మందపాటి సత్యం మాట్లాడుతూ.. ‘మొట్ట మొదటి టెక్సాస్ సాహితీ సదస్సు 1998 వ సంవత్సరంలో ఆస్టిన్ నగరంలో నిర్వహించాం' అని గుర్తు చేసుకొన్నారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

అది మొదలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెక్సాస్ నగరాలలో నిర్వహించడం, ఈ సారి 33వ సాహితీ సదస్సును డల్లాస్‌లో నిర్వహించడం, ఇలా నిర్విరామంగా మన సాహితీ తోటలో పువ్వులు విరబూయడం మన తెలుగుజాతి గొప్పదనం అని పేర్కొన్నారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

టాoటెక్స్ ఉత్తరాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి నిర్వహించిన ప్రశ్నా వినోద కార్యక్రమం అత్యంత ఆసక్తిగా సాగింది.పోకల సుమ మాట్లాడుతూ.. ఆడవాళ్ళు సమాజంలో ఎంతో పరిణితి సాధించారు, పురుషులతో సమానంగా అభివృద్ధి చెందారని అన్నారు.

కాగా, డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం డా. గుడివాడ ప్రభావతి 'బాల సాహితీ ప్రపంచం ' అన్న అంశంలో శ్రీనాధుని కవిత్వం గురించి ప్రస్థావించారు. పున్నం సతీష్ కవి జొన్నవిత్తుల రచించిన "బతుకమ్మ శతకం" నుండి పద్యాలు చదివి వినిపించారు. కన్నెగంటి చంద్రశేఖర్ జానపద కథల లక్షణాలు , విశేషాలు అత్యంత సరళంగా, వినోదాత్మకంగా వివరించారు. మద్దుకూరి చంద్రహాస్ ‘మృత్యుంజయ శతకం' ఒక పరిచయంలో కొన్ని ఆణిముత్యాల లాంటి పద్యాలు వినిపించారు.

కాజ సురేష్ 'ఆంధ్రనగరి' అనే పుస్తకం ఆంధ్రుల గురించి వివరించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఆద్వర్యంలో జరిగిన బాపుగారి మీద ప్రశ్నా వినోదం కార్యక్రమం జరిగింది. ప్రస్తుత కాలంలో మన తెలుగు సినిమాలలో దిగజారుతున్న సాహిత్య విలువలు గురించి డా. ఆళ్ల శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. డా. జువ్వాడి రమణ, పాల్కురికి సోమయాజులు రచించిన పండితారాధ్య చరిత్ర గురించి , డాక్టర్ శ్రీ భట్రాజు తన పుత్రుడు ఆంగ్లంలో రచించిన పుస్తకం గురించి పరిచయం చేసారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ సంస్థ అధ్యక్షులు కాకర్ల విజయ్ మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.

English summary
TANTEX Sahitya Vedika - 33rd Texas Sahitya Sadassu and 86th Nela Nela Telugu Vennela programme held at dallas, in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X