NRI News: అమెరికాలో బలవన్మరణానికి పాల్పడిన తెలంగాణ మహిళ..
అమెరికాలో తెలుగు మహిళ మృతి స్థానికంగా సంచలనం సృష్టించింది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం పరిధిలోని అమ్మనబోలు చెందిన ఏనుగు మల్లారెడ్డి, అనసూర్య దంపతులు హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని బ్యాక్ సైడ్ ఉన్న సూర్యోదయ కాలనీలో స్థిరపడ్డారు. వీరికి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డికి 18 ఏళ్ల క్రితం కవితతో వివాహం జరిగింది.
వివాహం అనంతరం శ్రీనివాస్ రెడ్డి, కవిత అమెరికా వెళ్లారు. అక్కడ శ్రీనివాస్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. కవిత గృహిణిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్యో సమస్యలు పెరగడంతో 40 ఏళ్ల కవిత గురువారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని భర్త శ్రీనివాస్ రెడ్డి ఇండియా ఫోన్ చేసి కవిత తల్లిదండ్రులకు తెలిపినట్లు తెలిసింది.

కవిత మృదేహాన్ని ఇండియాకు తీసుకొస్తారా.. లేక అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారా అనే విషయం తెలియరాలేదు. కొద్ది రోజుల క్రితం కర్ణాటకకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దంపతులు, వారి కుమారుడు అమెరికాలోని మేరీల్యాండ్‌లోని తమ ఇంట్లో అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు యోగేష్ హొన్నల నాగరాజప్ప 37, అతని భార్య ప్రతిభా వై అమర్‌నాథ్ 35, వారి కుమారుడు యష్ హొన్నల 6 బలవన్మరణానికి పాల్పడ్డారు.
యోగేష్ హొన్నల కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందినవాడు. యోగేష్ తొమ్మిదేళ్లుగా యుఎస్‌లో ఉన్నారని, భారతదేశంలోని కుటుంబ సభ్యులు బాల్టిమోర్ పోలీసులు తమను సంప్రదించినప్పుడు మరణాల గురించి తెలుసుకున్నారని చెప్పారు. "ముగ్గురూ ఆత్మహత్యతో మరణించారని పోలీసుల నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది. వారు మరణానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు" అని యోగేష్ తల్లి శోభ చెప్పారు.












Click it and Unblock the Notifications