NRI News: లండన్ లో భారతీయ వ్యక్తి 16 ఏళ్ల జైలు శిక్ష..
హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి యూకే కోర్టు 16 జైలు శిక్ష విధించింది. నిందితుడు 2022 మార్చి 5న యూకేలోని ఓ రెస్టారెంట్ లో తన మాజీ ప్రియురాలనిని కత్తితో పొడిచాడు. కేరళకు చెందిన సోనా బిజు, హైదరాబాద్ కు చెందిన శ్రీరామ్ అంబర్లా 2017 మే 23న హైదరాబాద్ లోని ఓ కళాశాలలో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కొన్నేళ్ల పాటు రిలేషన్ షిప్లో ఉన్నారు. ఆ తర్వాత వారి మధ్య గొడవలు మొదలయ్యాయి.
దీంతో ఇద్దరు వీడిపోయారు. ఆ తర్వాత సోనా బిజు 2022లో యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌లో మాస్టర్స్ కోసం UKకి వెళ్లారు. శ్రీరామ్ కూడా యూకే అదే సంవత్సరంలో యూకే వెళ్లాడు. సోనా చేరిన యూనివర్సిటీలోనే చేరాడు. కాగా సోనా బిజు హైదరాబాద్ వాలా రెస్టారెంట్ (UK)లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తుంది. ఒక రోజు శ్రీరామ్ హైదరాబాద్ వాలా రెస్టారెంట్ కు వెళ్లాడు. సోనా మాత్రం అతన్ని కస్టమర్ లాగా చూసి అతను ఆర్డర్ చేసిన విధంగా అతనికి ఆహారం అందించింది.

శ్రీరామ్ సోనా మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె పట్టించుకోలేదు. దీంతో ఆమె ద్వేషం పెంచుకున్న శ్రీరామ్ సోనాను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. హత్య చేయడం ఎలా.. ఇంగ్లాండ్ లో విదేశీయుడిని హత్యం ఏ శిక్ష పడుతుందని శ్రీరామ్ ఇంటర్నెట్ లో శోధించాడని అక్కడి పోలీసులు తెలిపారు. చివరికి కత్తి సోనాను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కత్తితో ఎలా పొడిస్తే చనిపోతుందని కూడా తెలుసుకున్నాడు.
ఆ తర్వాత నేరుగా రెస్టారెంట్ కు వెళ్లాడు. సోనాతో వాగ్వాదానికి దిగాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. నిరాకరిస్తే చంపేస్తానని బెదిరించాడు. సోనా పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో శ్రీరామ్ సోనాను కత్తితో పొడిచాడు. సోనా నేలపై పడిపోయినా కూడా వదలకుండా పొడిచడాని పోలీసులు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన రెస్టారెంట్ యాజమాన్యం ఆమెను లండన్ అంబులెన్స్ సర్వీస్ (LAS)లో ఆసుపత్రికి తరలించారు. ఆమె తర్వాత కోలుకుంది. ఈ కేసును విచారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది.












Click it and Unblock the Notifications