Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆటా సాంస్కృతిక సందడి (పిక్చర్స్)

న్యూయార్క్/హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతోపాటు సంబరాలను హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. ఇందులో భాగంగానే మహిళలో వచ్చే రొమ్ము క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఆంటీ పైరసీ, మహిళల భద్రతపై చైతన్యం తీసుకుని వచ్చేందుకు డిసెంబర్ 1న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ దగ్గర 5 కిలోమీటర్ల పరుగును నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి డికె అరుణ పరుగును ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వేలాది మంది యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల్లో అవగాహన, సాధికరత కోసం ఆటా చేస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి డికె అరుణ కొనియాడారు. ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఆంటీ పైరసీ, మహిళా భద్రత, గృహ హింసలపై చైతన్యం అవసరమని చెప్పారు. ఇటీవల చోటు చేసుకున్న నిర్భయ, అభయ ఘటనలు మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇవెంట్ కో-ఆర్డినేటర్ సురేష్ కాలేరు, డాక్టర్ భాస్కర్ రావు, కిమ్స్ సిఈఓ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అరీఫ్, హాకీ ఆటగాడు ముఖేష్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్ పిఆర్. మోహన్, సినీ నటుడు నవదీప్, డాక్టర్ సురేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. అత్యధిక సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నిర్వాహకులు తెలిపారు.

ఆటా సేవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాలను దత్తత తీసుకుంది. డిసెంబర్ 2న మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి మండలంలోని అమ్నూరు గ్రామంలో, డిసెంబర్ 3న బల్మూరు మండలంలోని మంగలికుంటపల్లిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాలను జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ ప్రారంభించారు. సుమారు వెయ్యి మందికి పైగా ప్రజలు శిబిరాల ద్వారా ప్రయోజనం పొందారు. వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌నూ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

విద్యా, మహిళా సదస్సులు:

‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ' నేపథ్యంతో నిర్వహించిన విద్యా సదస్సుకు సుమారు 500మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ సదస్సును ప్రారంభించగా, ఆటా, న్యూయార్క్ ఎడ్యుకేషన్ కమిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాజశేఖర్ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, యూఎస్ వైస్ కాన్సులేట్ జనరల్ కార్ట్నీ క్లేన్, రేణుకా రాజారావు, యూఎస్ఐఈఎఫ్ జాతీయ కో ఆర్డినేటర్ తానుష్క ప్రసంగించారు. ఆ తర్వాత మహిళల భద్రతా, గృహ హింసపై మహిళల్లో చైతన్యం కలిగించేందుకు సదస్సును నిర్వహించారు. రాష్ట్ర మంత్రి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేందర్ రెడ్డి, దేవనాథ్ జీయార్ స్వామిజీ, అహోబిల స్వామిజీలు పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

ఆటా 13వ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వందలాది మంది కళాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. తెలుగు చరిత, తెలుగు యువత, తెలుగు భవితపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, ఏపిసిసి కార్యదర్శి వినోద్ రెడ్డి, ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి, ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం పాల్గొన్నారు. ఆటా వేడుకల కో ఆర్డినేటర్ రామ్మోహన్ కొండా అతిథులను ఆహ్వానించారు. పద్మజా రెడ్డి నృత్య బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ మృదంగ విధ్వాంసుడు యెళ్ల వెంకటేశ్వర్ రావు ప్రదర్శన ఆహుతులను అమితంగా ఆకట్టుకుంది. కాగా రేలారే రేలా ఫేం రవి జానపద గేయాలతో ఆకట్టుకున్నాడు.

డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు జరిగిన ఆటా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికి ఆటా అధ్యక్షుడు కరుణాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆటా వేడుకలు కమిటీ ఛైర్ పద్మజారెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, కల్చరల్ కమిటీ అడ్వైజర్ డాక్టర్ సురేందర్ రెడ్డి, ఓవర్సీస్ కో ఆర్డినేటర్ సురేష్ కాలేరు, 5కె రన్ కో ఆర్డినేటర్ సుధాకర్ పెర్కరి, అనంత రెడ్డి పుజ్జురు, నరేందర్ చామర్ల, రామచంద్రారెడ్డి, పరమేష్ భీంరెడ్డి, బల్వంత్ కొమ్మిడి, కరుణాకర్ ఆసిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, లక్ష్మణ్ అనుగు, రాంరెడ్డి, రామ్మోహన్ కొండా, అజయ్ రెడ్డి, ధీరజ్ ఆకుల, మహీ సనపరెడ్డి, రఘువీర్ బండారు, హరిప్రసాద్ రెడ్డి లింగాల, రాజశేఖర్ వంగపాటి, అరవింద్ ముప్పిడి, రఘువీర్ రెడ్డి, రావు నెరుసు, విజయ్ థూపల్లి, లోకేష్ రెడ్డి, రవి బొజ్జ, వెంకట్ కొండపోలు, మనోహర్ ఏనుగు, రామకృష్ణ జూలకంట్ల, శ్రీకాంత్ గుడపాటి, శ్రావణ్ పోరెడ్డి, విష్ణు కల్వల ఆటా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆటా నిర్వాహకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


ఆటా సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు

డికె అరుణ స్పీచ్

డికె అరుణ స్పీచ్

అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్ నుంచి 5 కిలో మీటర్ల పరుగును నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రమంత్రి డికె అరుణ మాట్లాడారు. కార్యక్రమంలో సినీ నటుడు నవదీప్ పాల్గొన్నారు.

పరుగు ప్రారంభం

పరుగు ప్రారంభం

అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్ నుంచి 5 కిలో మీటర్ల పరుగును నిర్వహించారు. పరుగును జెండా ఊపి ప్రారంభిస్తున్న రాష్ట్ర మంత్రి డికె అరుణ, సినీ నటుడు నవదీప్.

యువత పరుగు

యువత పరుగు

అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్ నుంచి 5 కిలో మీటర్ల పరుగును నిర్వహించారు. పరుగులో భారీ ఎత్తున పాల్గొన్న యువత.

వైద్య శిబిరం

వైద్య శిబిరం

అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. కార్యక్రమంలో చిన్నారులకు వ్యాధినిరోధక మాత్రలు వేస్తున్న దృశ్యం.

భారీ స్పందన

భారీ స్పందన

అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలు తరలివచ్చారు.

మృదంగ ప్రదర్శన

మృదంగ ప్రదర్శన

ఆటా 13 సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో వందలాది మంది కళాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రముఖ మృదంగ విధ్వాంసుడు యెళ్ల వెంకటేశ్వర్ రావు ప్రదర్శన ఆహుతులను అమితంగా ఆకట్టుకుంది.

ఆటా వేదిక

ఆటా వేదిక

ఆటా 13 సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో వందలాది మంది కళాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా వేదికపై ఆటా నిర్వాహకులు, కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు.

మహిళా సదస్సు

మహిళా సదస్సు

మహిళల భద్రతా, గృహ హింసపై మహిళల్లో చైతన్యం కలిగించేందుకు ఆటా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సును రాష్ట్ర మంత్రి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభిస్తున్న దృశ్యం.

సదస్సులో పొన్నాల

సదస్సులో పొన్నాల

‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ' నేపథ్యంతో ఆటా నిర్వహించిన విద్యా సదస్సుకు సుమారు 500మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సదస్సును రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రారంభించి ప్రసంగించారు.

కార్యక్రమంలో ప్రముఖులు

కార్యక్రమంలో ప్రముఖులు

ఆటా 13వ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి వెంకట్ రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, ఏపిసిసి కార్యదర్శి వినోద్ రెడ్డి, ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి, ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం పాల్గొన్నారు

ఆకట్టుకున్న ప్రదర్శన

ఆకట్టుకున్న ప్రదర్శన

ఆటా 13 సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో వందలాది మంది కళాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమంలో ఆహుతులను అమితంగా ఆకట్టుకున్న కళా ప్రదర్శన.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+