NRI News: ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆటా ప్రతినిధి..
అమెరికా తెలుగు అసోసియేషన్ ఇండియాలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా ఆటా ప్రతినిధి జంబుల విలాస్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడి ఆయన.. సొంత గ్రామం పై ఉన్న మమకారంతో తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు సహాయ, సహకారులుంటాయని పేర్కొన్నారు. పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని విలాస్ రెడ్డి గుర్తు చేశారు.
తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఈరోజు అమెరికాలో మంచి ఉద్యోగం లో స్థిరపడినట్లు విద్యార్థులకు వివరించారు. పాఠశాల విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలని.. తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎప్పుడు మీ పాఠశాలకి సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. ఐదు తరగతులకు నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని.. ఒక వాలంటీర్ కు సంబంధించి సంవత్సరానికి సరిపడా డబ్బులు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారైలు సంతోష్ రెడ్డి కోరం, ప్రదీప్ కట్ట , శ్రీకాంత్ రెడ్డి తుమ్మల పాల్గొన్నారు. 2024 జూన్ 7, 8, 9 తేదీలలో అమెరికాలో అట్లాంటా నగరంలో ఆట సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాల అన్ని రంగాల ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. త్వరలోనే ప్రముఖులను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ఆటా ఆధ్వర్యంలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications