బహరేన్‌లో తెలంగాణ బిడ్డ మృతి: ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆర్థిక సహాయం

Subscribe to Oneindia Telugu

బహరేన్/కామారెడ్డి: తెలంగాణ కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు వయస్సు 34 పాస్పోర్ట్ నెంబర్M9743802 బహరేన్‌లో ఒక్క ప్రైవేట్ కంపెనీ లో విధులు నిర్వహిస్తూ 8 ఆగస్ట్ 2017న జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు.

బహ్రెయిన్‌లో నేలరాలిన తెలంగాణ బిడ్డ: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం..

ఆయన పార్థివ దేహాన్ని మృతిచెందిన 15 రోజులలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలోఆగస్ట్ 23న స్వగ్రామానికి పంపించడం జరిగింది. ఆయనకు భార్యతో పాటు ఒక కూతురు, కుమారుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ పరిస్థితులను చూసి కొంతమంది ఎన్నారై టీఆర్ఎస్ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు.

 bahrain trs cell financial helps to indian labour family

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, మరి బాబు తోటి కంపనీ లో పనిచేసే కార్మికులు, వారి ట్రాన్స్‌పోర్టేషన్‌ ఆఫీసర్ శివరాజ్ ప్రభు వారి అద్వర్యంలో ఆర్థిక సాయంగా రూ.120, 309/- లను బాధిత కుటుంబానికి బ్యాంక్ ద్వారా అందించారు.

 bahrain trs cell financial helps to indian labour family

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీ డా రవి, సెక్రెటరీలు రవిపటేల్ దెషెట్టి, సుమన్ అన్నారం, జాయంట్ సెక్రెటరీలు గంగాధర్ గుమ్ముల, సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్ ఆకుల, నర్సయ్య, Ch రాజేందర్, వినోద్, సాయన్న, వసంత్ తదితరులు దీనికోసం తమవంతు సహాయం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Markanti Babu who is working in Bahrain was killed in road accident on August 8th. TRS NRI cell members helped them financially

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి