అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి: సరస్సులో మృతదేహం లభ్యం
బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళిలో విషాదం నెలకొంది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన గోవాడ నాగసాయి గోపి అరుణ్ కుమార్ (23)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
అమరావతి: బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళిలో విషాదం నెలకొంది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన గోవాడ నాగసాయి గోపి అరుణ్ కుమార్ (23)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్ానరు. అమెరికాకు పంపించి చదువు చెప్పించే స్తోమత లేకపోయినప్పటికీ.. ఉన్న ఆస్తులు కుదువపెట్టి తమ కుమారుడ్ని పంపిస్తే.. విగత జీవిగా వచ్చాడని రోదిస్తున్నారు.
ఏడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గోపి అరుణ్ కుమార్.. మార్చి 1వ తేదీ నుంచి కనిపించడం లేదని అతని స్నేహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 4వ తేదీన గోపి ఉండే నివాసానికి సమీపంలోని సరస్సులో అరుణ్ కుమార్ మృతదేహం పోలీసులకు లభించిందని సన్నిహితులు తెలిపారు.

మృతదేహానికి అమెరికాలోనే పోస్టుమార్టం నిర్వహించి, అక్కడి స్నేహితుల సహకారంతో భారత్‌కు పంపించారు పోలీసులు. ముందు ప్రమాదంగా చెప్పి.. తర్వాత ఆత్మహత్య అనడంతో తల్లిదండ్రులు సింగయ్య, సుబ్బాయమ్మ.. గోపి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చేతికందిన కొడుకు విగత జీవిగా ఇంటికి రావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికాలో అసలేం జరిగిందో తమకు తెలియడం లేదని వాపోతున్నారు.












Click it and Unblock the Notifications