వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"చరిత్రకే ఒక్కడు " పుస్తక ముఖచిత్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

అట్లాంటా: "చరిత్రకే ఒక్కడు " పుస్తక ముఖ చిత్రాన్ని, అట్లాంటా మహానగరంలో, ప్రవాసాంధ్ర పాత్రికేయుడు వేణుగోపాల్ ఉడుముల ఆధ్వర్యంలో , ప్రముఖ తెలుగు సామాజిక నాయకులు డాక్టర్ ప్రేమ రెడ్డి , డాక్టర్ మల్లా రెడ్డి, డాక్టర్ సంజీవ రెడ్డి , డాక్టర్ హరనాథ్ పొలిచర్ల ఆవిష్కరించారు.

డాక్టర్ ప్రేమ రెడ్డి మాట్లాడుతూ , "నా మిత్రుడు , రాజనీతిజ్ఞుడు డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర " చరిత్రకే ఒక్కడు" పుస్తక రూపంలోకి తీసుకు వస్తున్నందుకు , వేణుగోపాల ఉడుములను, పుస్తక రచయిత కరణ్ రెడ్డిని అభినందిస్తున్నానని చెప్పారు.

Cover page of book on YSR released

డాక్టర్ మల్లా రెడ్డి మాట్లాడుతూ "నా మిత్రుడు, మహా నాయకుడు డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర " చరిత్రకే ఒక్కడు" పుస్తక విశేషాలు, ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పారు.

డాక్టర్ సంజీవ రెడ్డి మాట్లాడుతూ "తెలుగు వాళ్లకు, డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు మరువలేరని" చెప్పారు. డాక్టర్ హరనాథ్ పొలిచర్ల మాట్లాడుతూ " డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి, ప్రవాసాంధ్రులతో కలిగిన, స్నేహం , అనుబంధం మరువలేనిదని " చెప్పారు.

ప్రవాసాంధ్ర పాత్రికేయుడు వేణుగోపాల్ ఉడుముల మాట్లాడుతూ "చరిత్రకే ఒక్కడు" పుస్తకం, కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారని, యువ రాజకీయ వేత్తలకు, ప్రజా సేవ చేయాలనుకొనే వాళ్లకు, ఈ పుస్తకం ఒక మహా గ్రంథమని చెప్పారు.

డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డితో తమకు గల అనుబంధాన్ని రాజేశ్వర్ రెడ్డి గంగసాని, మొండిఎద్దు వెంకట్, కిరణ్ కందుల, మోహన్ తలమాటి, వెంకట్ మేడపాటి,ఆళ్ళ రామి రెడ్డి , చిన్న బాబు రెడ్డి గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర "చరిత్రకే ఒక్కడు" ఒక పుస్తక రూపం లో తీసుకురావాలనే పట్టుదలతో, రచయత చెరుకు కరణ్ రెడ్డి, ప్రవాసాంధ్ర పాత్రికేయుడు వేణుగోపాల్ ఉడుముల సహకారంతో, డిసెంబర్ 30వ తేదీన ఈ పుస్తకాన్ని ప్రపంచ వ్యాప్తంగా, హైదరాబాద్‌లోస తెలుగు వాళ్ళున్న దేశాల్లో విడుదల చేస్తున్నారు.

English summary
Cover page of a book on YS Rajasekhar Reddy has been released at Atlanta in USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X