వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హనీమూన్ హత్య: నిర్ధోషిగా ష్రీన్ దేవాని, తీర్పుపై బాధితుల కంటతడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కేప్‌టౌన్: తమ కుమార్తె అన్నీ దేవానీ హత్యకు కారణమైన అల్లుడు ష్రీన్ ప్రకాశ్ దేవానిని దక్షిణాఫ్రికా కోర్టు నిర్దోషిగా విడుదల చేయడంపై ఆమె కుటుంబసభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు కోర్టులో న్యాయం జరగలేదని, ఈ తీర్పు తమకు జీవితాంతం వేదననే మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నవంబర్ 2010లో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కి భారతీయ వ్యాపారవేత్త ష్రీన్ ప్రకాశ్ దేవాని(34) అతని భార్య అన్నీ దివానీతో హనీమూన్ వచ్చాడు. అక్కడే ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్‌లో నివాసముంటున్న భారతీయ వ్యాపారవేత్త ష్రీన్ ప్రకాశ్ దేవాని(34)ని విచారణ నిమిత్తం పోలీసులు దక్షిణాఫ్రికాకు తరలించారు.

2010లో ఇండో-స్వీడిష్ మహిళ అన్నీ(28)ని వివాహం చేసుకున్న దేవాని.. హనీమూన్‌కు దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లి అక్కడే హత్య చేశాడు. అయితే తాను తన భార్యను హత్య చేయలేదని దేవాని పేర్కొన్నాడు. కాగా, దేవానిని దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నగరానికి తరలించారు. నిందితుడు ష్రీన్‌ను కేప్‌టౌన్‌కు తరలించినట్లు స్కాట్లాండ్ నేర విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

అన్నీ హత్య జరిగిన అనంతరం డిసెంబర్ 7, 2010లోనే దక్షిణాఫ్రికా పోలీసులు ష్రీన్ దేవానిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్లపాటు కొనసాగిన విచారణ అనంతరం నిందితుడు దేవానిని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడు దేవానిని నిర్దోషిగా ప్రకటించింది. తీర్పుతో బాధితురాలి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురై కంటతడిపెట్టారు.

కేప్‌టౌన్ హైకోర్టు ఎదుట కంటతడి పెట్టుకుంటూ మాట్లాడిన అన్నీ దేవాని సోదరి అమి డెన్బోర్గ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో తమకు న్యాయం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం లభిస్తుందన్న ఆశతో ఇక్కడికి వచ్చామని, అయితే ఇక్కడ నిరాశే మిగిలిందని చెప్పారు.

అన్నీ దేవాని అక్కా, అన్నయ్యలు

అన్నీ దేవాని అక్కా, అన్నయ్యలు

తమ కుమార్తె అన్నీ దివానీ హత్యకు కారణమైన అల్లుడు ష్రీన్ ప్రకాశ్ దేవానిని దక్షిణాఫ్రికా కోర్టు నిర్దోషిగా విడుదల చేయడంపై ఆమె కుటుంబసభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

అన్నీ కుటుంబసభ్యులకు ఓదార్పు

అన్నీ కుటుంబసభ్యులకు ఓదార్పు

కేప్‌టౌన్ కోర్టు తీర్పు అనంతరం కంటతడి పెడుతున్న అన్నీ దేవాని సోదరి అమి డిన్బోర్గ్, సోదరుడు అనీష్ హిందోచా. వారిని ఓదారుస్తున్న దృశ్యం.

కంటతడి పెడుతున్న అన్నీ తండ్రి వినోద్ హిందోచా

కంటతడి పెడుతున్న అన్నీ తండ్రి వినోద్ హిందోచా

తమకు కోర్టులో న్యాయం జరగలేదని, ఈ తీర్పు తమకు జీవితాంతం వేదననే మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్ధోషిగా విడుదలైన ష్రీన్ దేవాని

నిర్ధోషిగా విడుదలైన ష్రీన్ దేవాని

నవంబర్ 2010లో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కి భారతీయ వ్యాపారవేత్త ష్రీన్ ప్రకాశ్ దేవాని(34) అతని భార్య అన్నీ దివానీతో హనీమూన్ వచ్చాడు. అక్కడే ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

నాలుగేళ్లపాటు ఎంతో సహనంతో వేచి చూశామని, తమ ప్రియమైన చెల్లెలిని కోల్పోయామని కంటతడి పెట్టారు. కాగా, ష్రీన్ దేవానిని దోషిగా ప్రటించేందుకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్లే అతడ్ని నిర్ధోషిగా ప్రకటిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

ఇది ఇలా ఉండగా కేప్‌టౌన్‌లో అన్నీ చనిపోకముందు, తన భర్త ఒక రాక్షసుడని త్వరలో తాను విడాకులు కోరనున్నానని దగ్గరి బంధువులకు అన్నీ మెయిల్ చేసింది. బ్రిస్టల్‌లో ఒక వ్యాపారి అయిన ష్రీన్ దేవాని 'గే' జీవితం గడిపినట్లు దక్షిణ ఆఫ్రికా పోలీసులు నిర్ధారించుకున్నారు. విడాకులు తీసుకుంటానన్న తన భార్యను చంపమని కూడా వ్యక్తులను పెట్టినట్లు తెలిపారు.

స్వలింగ సంపర్కం కోసం ఒక కుర్రాడికి మనీ యిచ్చాడన్న పోలీసుల కథనాన్ని'హాస్యాస్పదంగా" కొట్టిపారేశాడు దేవాని. అయితే, దేవానికిగల మరో 'గే లవర్" తాను దేవానితో సెక్సు జరిపానని పోలీసులకు తెలిపాడు. దేవాని తరచుగా సౌత్ లండన్లోని 'వాక్స్ల్ హాల్ గే క్లబ్" ను సందర్శిస్తూంటాడని, ఈ క్లబ్ కు వచ్చేవారంతా సెక్సు కోసం రబ్బరు, లెదర్ పరికరాలు ఉపయోగించే టైపని పోలీసులు తమ దర్యాప్తులో వెల్లడించారు.

English summary
Disappointed over the acquittal of shrien Dewani, the family of slain bride Anni Dewani has said that the South African justice system has failed them and not knowing what happened will “haunt us for the rest of our lives."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X