సీజీఐగా బాధ్యతలు స్వీకరించిన అనుపమ్ రే
హోస్టన్: కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా (సీజీఐ)గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనుపమ్ రేని ఇండియన్ అమెరికన్ ప్రెండ్‌షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్‌సీ) నేతలు మే 13వ తేదీన మర్యాద పూర్వకంగా కలిశారు. భారతదేశం అభివృద్ధి కోసం ఐఎఎఫ్‌సీ చేస్తున్న సేవలను అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఈ సందర్భంగా వివరించారు.
1990లో ఏర్పాటైన ఐఎఎఫ్‌సీ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పాలసీలకు సంబంధించిన అభిప్రాయలను వ్యక్తీకరించుకునేందుకు ఎంతోగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా అమెరికాలోని భారత కమ్యూనిటీ కోసం ఈ సంస్ధ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని చెప్పారు.
అమెరికా-ఇండియా మధ్య మంచి సంబంధాలను నెలకొల్పడం, అభివృద్ధి చెందిన దేశాలకు మద్దతుగా నిలవడం, అంతర్జాతీయ ప్రజాస్వామ్యాన్ని ప్రచారం చేయడం, భారతీయ అమెరికన్ కమ్యూనిటీలో ఉన్న నేతల ఆశక్తులకు అనుగుణంగా ఇది పనిచేస్తోందని తెలిపారు.

1994లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లోకి చేరడానికి ముందు డాక్టర్ అనుపమ్ రే న్యూరో సర్జరీ రెసిడెంట్‌గా పని చేశారు. సీజీఐగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు బంగ్లాదేశ్‌లో పొలిటకల్ ఆఫీసర్, శ్రీలంకలో డెస్క్ ఆఫీసర్, లండన్‌లో కామన్ వెల్త్ సెక్రటర-జనరల్‌గా పనిచేశారు.
న్యూయార్క్‌లోని యుఎన్ సెక్రటరీ కౌన్సిల్‌లో భారతదేశం నుంచి సీనియర్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. 2012లో భారత దేశం తరుపు నుంచి (డెవప్మెంట్ పార్టనర్‌షిప్ అడ్మిస్ట్రేషన్) విభాగంలో మొట్టమొదటి ఉద్యోగి ఇతనే. ఎమ్ఎ పబ్లిక్ అడ్మిస్ట్రేషన్‌లో పట్టా పొందిన ఆయన ఇంగ్లీషు, జర్మన్, హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు.












Click it and Unblock the Notifications