అరుదైన గౌరవం: రాయల్ సొసైటీ అధిపతిగా రామకృష్ణన్
లండన్: న్యూటన్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల కనుసన్నల్లో నడిచిన ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీకి భారత సంతతి వ్యక్తి ఒకరు తొలిసారిగా సారథ్యం వహించబోతున్నారు. రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా నోబెల్ గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్(63) ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన సొసైటీ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల ఫలితాన్ని ప్రకటించారు.
2015 డిసెంబర్ 1న ఆయన పదవీ బాధ్యతలు చేపడుతారు. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఈ పదవికి ఎంపికవ్వడం ఇదే తొలిసారి. 16ఏళ్ల క్రితం అమెరికా నుంచి వచ్చి బ్రిటన్‌లో స్థిరపడ్డాను. ‘ఈ పదవికి రాయల్ సొసైటీ నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది' అని వెంకట్రామన్ పేర్కొన్నారు.

రిబోసోమ్స్ నిర్మాణాన్ని కనుగొన్నందుకుగానూ 2009లో నోబెల్ పురస్కారాన్ని మరో శాస్త్రవేత్తతో కలిసి పంచుకున్నారు. తమిళనాడులోని చిదంబరంలో జన్మించిన వెంకట్రామన్ అమెరికాలో బయోలజీ విద్యనభ్యసించారు.
ప్రస్తుతం బ్రిటిష్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్స్ లేబొరేటరీకి డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. 2003లో రాయల్ సొసైటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2012లో బ్రిటన్ రాణి చేతులు మీదుగా ఆయనకు నైట్ అవార్డు లభించింది.












Click it and Unblock the Notifications