శాస్త్రవేత్త సంజయ్ రాజారాంకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

ఆయన అభివృద్ధి చేసిన దాదాపు 480 గోధుమ రకాలను 51 దేశాల్లో విడుదల చేశారు. రాజారాం పరిశోధనల ఫలితంగా హరిత విప్లవం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల టన్నులకు పైగా గోధుమ ఉత్పత్తి పెరిగింది.
రాజారాం అందించిన సేవలు అనేకమందికి మార్గదర్శకంగా నిలువనున్నాయని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ అభినందించారు. ఆయన చేసిన పరిశోధలనలను ద్వితీయ హరిత విప్లవంగా పేర్కొనవచ్చని అన్నారు. రాజారాం చేసిన పరిశోధనలకు గుర్తింపుగానే ఈ పురస్కారాన్ని అందిస్తున్నామని, ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రకటించడం తమకు చాలా సంతృప్తినిచ్చిందని ప్రపంచ ఆహార పురస్కార వ్యవస్థాపక అధ్యక్షుడు కెన్నెత్ ఎం క్విన్ తెలిపారు.
మనదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన రాజారాం మెక్సికోలో స్థిరపడ్డారు. రూ. కోటి(2,50,000 అమెరికన్ డాలర్లు)కి పైగా విలువైన ఈ పురస్కారాన్ని రాజారాం అక్టోబరులో స్వీకరించనున్నారు.












Click it and Unblock the Notifications