యజమాని కుమారుడి కాల్పులు: ఎన్నారై మృతి
రియాద్: ఉపాధి కోసం సౌదీ అరేబియా వచ్చిన ఓ భారతీయు యువకుడు తన యజమాని కుమారుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగింది. బాధితుడు సౌదీ అరేబియాకు వచ్చిన వారం రోజులకే(గత శుక్రవారం) ఈ ఘటన చోటు చేసుకుంది.
మక్కా పోలీసుల కథనం ప్రకారం.. భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన అనాస్ పుద్విలికాల్వి(24) మక్కాలోని ఓ వ్యక్తి ఇంట్లో కారు డ్రైవర్‍గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు వారం రోజుల క్రితమే సౌదీ అరేబియాలోని మక్కాకు వచ్చాడు.

శుక్రవారం తన యజమాని కుటుంబ సభ్యులను తౌఫా తీసుకెళ్లిన అనాస్ పుద్విలికాల్వి.. తిరిగి అదే రాత్రి వారి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సమయంలోనే యజమాని కుమారుడు.. అనాస్‌పై కాల్పులు జరిపాడు.
కాల్పుల్లో అనాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని మక్కాలోని కింగ్ ఫైసల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు చెప్పారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications