యువతులపై వేధింపులు: ఎన్నారై అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు జితేంద్ర ప్రసాద్ గత ఐదేళ్లుగా అక్లాండ్ పాఠశాలలో ఓ డెంటల్ సర్వీస్ సెంటర్ తరపున విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే గత రెండేళ్లుగా పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ముగ్గురు యువతులపై నిందితుడు ప్రసాద్ వేధింపులకు పాల్పడుతున్నాడు.
అతనిపై వేధింపుల ఆరోపణలు రావడంతో ఆ డెంటల్ సర్వీస్ సెంటర్ యాజమాన్యం అతన్ని విధుల నుంచి తొలగించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు ప్రసాద్ కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
నిందితుడు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితుడికి బెయిల్‌పై రిమాండ్ విధించింది. వచ్చే నెలలో నిందితునికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.












Click it and Unblock the Notifications