విద్యార్థిని గదికెళ్లి లైంగిక వేధింపులు: ఎన్నారైపై రేప్ కేసు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని గదికి వెళ్ళి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారతీయ విద్యార్థి(18)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓస్వేగోలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో విద్యనభ్యసిస్తున్న న్యూఢిల్లీకి చెందిన అభయ్ పంత్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.
క్యాంపస్ న్యూస్ పేపర్ ఓస్వేగోనియన్ కథనం ప్రకారం.. అభయ్ పంత్‌ను ఫస్ట్ డిగ్రీ రేప్ కేసులో వర్సిటీ పోలీసులు గత వారం అరెస్ట్ చేశారు. ఉదయం వేళలో వర్సిటీలోని ఓ విద్యార్థిని గదికి వెళ్లిన పంత్, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రజా సంబంధాల డైరెక్టర్ జులియా బ్లిసర్ట్ తెలిపారు.

పంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. బెయిల్ కోసం 50వేల అమెరికన్ డాలర్లు చెల్లించాలని, లేదా లక్ష డాలర్ల బాండ్‌ను సమర్పించి మరోసారి కోర్టు ఎదుట హాజరుకావాలని కోర్టు అతడ్ని ఆదేశించింది.
లైంగిక వేధింపులకు పాల్పడినవాడరు క్యాంపస్‌లో ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గతంలో కూడా లైంగిక వేధింపులు క్యాంపస్‌లో చోటు చేసుకున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు.












Click it and Unblock the Notifications