సరస్సులో గల్లంతైన భారత విద్యార్థి మృతి

Indian student rescued from New Zealand lake dies
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో భారతదేశానికి చెందిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. న్యూజిలాండ్‌లోని రొటోరువాలో నివాసముంటున్న సిద్ధాంత శర్మ అనే 21ఏళ్ల విద్యార్థి మరో ముగ్గురితో కలిసి మంగళవారం టౌపో సరస్సులో బోటు షికారుకు వెళ్లారు.

ఈత కొట్టేందుకు సరస్సులో దూకిన సిద్ధాంత శర్మ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. దీంతో ఓ విదేశీ టూరిస్ట్ సరస్సులో దూకి అతన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న శర్మను సిద్ధాంత శర్మను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అతన్ని హామిల్టన్‌కు తరలించినా ఫలితం దక్కలేదు. బుధవారం చికిత్స పొందుతూ శర్మ మృతి చెందాడు.

అదృశ్యమైన భారత విద్యార్థి ఆచూకీ లభ్యం

లండన్: గత వారం అదృశ్యమైన భారత సంతతికి చెందిన పాఠశాల విద్యార్థి ఆచూకీ లభ్యమైంది. హాంప్‌షైర్‌లోని సౌతాంప్టన్‌ నగరంలో విద్యార్థి క్షేమంగా దొరకడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. జస్ప్రీత్ కున్‌కున్ (12) తన కుటుంబ సభ్యులతో వాల్సల్ వెస్ట్ మిడ్‌లాండ్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా అతడు మార్చి 5న పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అదృశ్యమయ్యాడు.

దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు స్థానికులు, ప్రజల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. హాంప్‌షైర్ పట్టణానికి కొన్ని మైళ్ల దూరంలో బాలుడు క్షేమంగా లభించడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. గత సంవత్సరంలో కూడా నాలుగు అదృశ్యమైన ఈ బాలుడు క్షేమంగానే తిరిగి ఇంటికి చేరుకోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+