ఎన్నారై మహిళ సజీవదహనం

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తన కథనంలో.. పర్వీందర్ కౌర్ పెట్రోలు మంటలలో 85శాతం కాలిపోయి మరణించిందని, అయితే ఆ ఘటన ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని పేర్కొంది. కాగా సోమవారం రౌస్‌హిల్‌లోని తన నివాసం నుంచి మంటలలో కాలిపోతూ వచ్చిన పర్వీందర్ కౌర్ ఇంటి ముందు కుప్పకూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
బాధితురాలి మంటలలో కాలిపోతుండగా ఆమె భర్త కుల్విందర్ సింగ్ తన చేతులతో నియంత్రించేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అయితే పర్వీందర్ కౌర్ ఇంటి పొరుగువారు మాత్రం ఆమె మంటల్లో కాలిపోతూ సహాయం కోసం అరుపులు చేసుకుంటూ ఇంటి బయటికి వచ్చి కుప్పకూలిందని పేర్కొన్నారు. బాధితురాలు మంటల్లో కాలిపోతూ ఇంటి బయటికి వచ్చిన సమయంలో ఆమె భర్త ఓ దుప్పటిని కప్పేందుకు ప్రయత్నించాడని మరో సాక్షి చెప్పారు.
డిటెక్టివ్ సూపరింటెండెంట్ రాబ్ క్రిత్లా మాట్లాడుతూ..బాధితురాలి భర్త కుల్విందర్ సింగ్‌ను విచారించామని, అయితే ఘటనకు సంబంధించి అతను భిన్నమైన వాదన వినిపించారని చెప్పారు. ఇది ఒక భయానకమైన మరణమని, ఆమె సహాయం కోసం అరుపులు చేసిందని ఆయన తెలిపాడు.












Click it and Unblock the Notifications