కొడుకును చంపిన భారత మహిళ

కొద్దిరోజులుగా ఆయనకు అర్ణవ్ స్కూల్ నుంచి ఈ మెయిల్స్ వస్తున్నాయి. గత బుధవారం ఇంటికి చేరుకున్న ఆయనకు ఇంట్లో భార్య కనిపించకపోయేసరికి పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చి ఇంటిని పరిశీలించగా బాత్‌టబ్‌లో పడి ఉన్న అర్ణవ్ మృతదేహం కనిపించింది.
ఇంతలో ఆమె ఇంటికి చేరుకుంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పిల్లాణ్ని తనే చంపినట్టు ఒప్పుకొంది. బాలుడి మృతదేహానికి వైద్యులు అటాప్సీ, టాక్సికాలజీ నిర్వహించారు.
కాగా, పిల్లవాడిని చంపింది తానేనని పల్లవి చెప్పినా ఆమె లాయర్ మాత్రం వేరే కథనం వినిపిస్తున్నారు. అర్ణవ్‌కు ఆరోగ్య సమస్యలున్నాయని, బహుశా వాటితోనే అతడు చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు.
పోలీసులు పల్లవిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ హత్యకు గల కారణమేమిటనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications