కెసిఆర్ కష్టపడుతున్నారు: లండన్‌లో కవిత (పిక్చర్స్)
లండన్: లండన్ లో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ నాల్గవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నిజామబాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కల్వకుంట్ల కవిత గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యుకె నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు. ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళ్ళు అర్పించి, తెలంగాణా గీతం జయ జయహే తెలంగాణా తో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎన్నారై టిఆర్ఎస్ నాలుగేళ్లలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు. ఇది చూసి హాజరైన ప్రతి ఒక్కరు ఉద్వేగానికి లోనయ్యారు. ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదని కల్వకుంట్ల కవిత ప్రశంసించారు. బంగారు తెలంగాణా నిర్మాణ దిశలో టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వివరించారు. తను లండన్‌లో గత వారం రోజులు గా హాజరైన అధికారిక కార్యక్రమాల గురించి వివరించారు.
సలహా బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధనలో లండన్‌లోని టిఆర్ఎస్ సెల్ పాత్రని వివరించారు. తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేకించి ఎన్నారై విభాగాన్ని త్వరలో ప్రారంభించాలని కవితను కోరారు.

అప్రమత్త అవసరం
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత వరకు మనం అప్రమత్తంగా ఉండాలని, మళ్లీ ఎటువంటి పోరాటాలకైన సిద్దంగా ఉండాలని తెలిపారు.

వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకుని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెళ్తుంది కాబట్టి మీరు కూడా ఎటువంటి సలహాలు అయినా లేదా సందేహాలు ఉన్న వ్యక్తిగతంగా తనను గానీ, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని గానీ సంప్రదించవచ్చునని తెలిపారు.

కెసిఆర్ కష్టపడుతున్నారు..
మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ అహర్నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు.

కరాటే రాజు కూడా..
లండన్‌లో కరాటే పోటీలకు వచ్చిన ఓయు జెఎసి అద్యక్షుడు కరాటే రాజు కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ, తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా కవితను మనం చూడడం ఖాయమని, ఆమెతో తనకు ఉద్యమంలో ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకొన్నారు. అలాగే లండన్ లోని ఎన్నారై ల పాత్రను కొనియాడారు.

కవితకు కృతజ్ఞతలు
ఎంతో బిజీగా ఉన్నపటికీ సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు ఎన్నారై టిఆర్ఎస్ అద్యక్షుడు అనిల్ కూర్మాచలం కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై టిఆర్ఎస్ సెల్‌కు ఎప్పటికప్పుడు కెసిఆర్, టిఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కవిత ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ ఆదేశాల మేరకు పునర్నిర్మాణంలో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు.

వంద రోజుల పుస్తకం
టిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ 100 రోజుల పాలన - నిర్ణయాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. తరువాత కేకు కట్ చేసి, కవిత అతిథులని వ్యక్తిగతంగా వెళ్లి కలిసి సందడి చేశారు.

వీరంతా ఇలా..
కార్యక్రమంలో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, సలహా బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి అశోక్ దూసరి, చంద్రశేకర్ గౌడ్, ముఖ్య నాయకులు మంద సునీల్ రెడ్డి, శ్రీధర్ రావు, విక్రం రెడ్డి, హరి నవపేట్, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

కార్యక్రమంలో కూడా..
సేరు సంజయ్, గోలి సుమన్, శ్రీకాంత జెల్ల, సుమ దేవి, పవిత్ర, మరియు ఇతర తెలంగాణ సంస్థ ప్రతినిథులు సుమన్ రావు , ఉదయ నాగరాజు , గోలి తిరుపతి, ప్రమోద్,నిర్మల, శ్వేత కూడా హాజరైనవారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications