పదేళ్లు తండ్రి ముఖం చూడలేదు: శవమై వస్తున్నాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీకి చెందిన ఓ కుటుంబం తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. మూడేళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లిన 28 ఏళ్ల హైదరాబాదీ ఆక్‌లాండ్‌లో శనివారంనాడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

చంచల్‌గుడ ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఫహద్ న్యూజిలాండ్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ ఆక్లాండ్‌లో ఆయన కారును మరో కారు ఢీకొట్టడంతో అతను మరణించాడు.

Kiwi tragedy: Father didn’t see him for 10 years

అతన్ని దశాబ్ద కాలం పాటు ఆయన తండ్రి చూడలేదట. ఇప్పుడు అతని శవం కోసం ఎదురు చూస్తున్నాడు. ఫహద్ తండ్రి మెహమూదీ 12 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్నాడు. ఫహద్ న్యూజిలాండ్ వెళ్లిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాడు. దాంతో ఫహద్‌ను కలిసే అవకాశం ఆయనకు రాలేదు.

ఫహద్‌నకు ఓ సోదరుడు, నలుగురు అక్కలు ఉన్నారు. అతనే అందరికన్నా చిన్నవాడు. పెళ్లి చేసుకుని ఫహద్ న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. అతను మార్చిలో హైదరాబాదు రావాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే ప్రమాదానికి గురయ్యాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 28-year-old Hyderabadi, who went to New Zealand nearly three years ago, died in a road accident in Auckland in the early hours of Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి