NRI News: అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై దాడి.. స్పందించిన కేటీఆర్..

అమెరికాలో తెలుగు విద్యార్థిపై దాడి జరిగింది. యూఎస్ లో ఎంఎస్ చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిపై నిందితుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇండియాలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్‌ రాజ్‌ పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు.

ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చేస్తున్నాడు. వరుణ్‌ ఎంఎస్‌ చేస్తూనే పార్ట్‌టైం జాబ్‌ కూడా చేస్తున్నాడు. మంగళవారం వరుణ్‌ జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఒక్కసారి ఓ దుండగుడు కత్తితో అతడిపై దాడికి దిగాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వరుణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వరుణ్‌ను ఆసుపత్రికి తరలించారు.

KTR responded to the attack on a Telugu student in America
వరుణ్‌ రాజ్‌పై దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్ల అమెరికా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల వివరించారు. మరోవైపు మహబూబాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వరుణ్‌ రాజ్‌ తండ్రి రామ్మూర్తి మంత్రి పువ్వాడ అజయ్‌ను కలిసి.. పరిస్థితిని వివరించారు. తన కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. గత ఫిబ్రవరిలో ఓ ఖమ్మం విద్యార్థి చనిపోయాడు.

వరుణ్ పై దాడి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తామని చెప్పారు. అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్‌కు కావాల్సిన సహకారాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు. వరుణ్ కుటుంబసభ్యులతో తన టీం మాట్లాడుతుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+