టీడీపీ కువైట్ సంబరాలు: నంద్యాల, కాకినాడ విజయోత్సవ వేడుకలు

నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఈ సంబరాలు జరుపుకున్నారు.

కువైట్: నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయాన్ని సాధించిన సంధర్భంగా తెలుగుదేశం కువైట్ ఆధ్చర్యములో ఘనంగా విజయోత్సవ వేడుకలను నిర్వహించారు.కువైట్ లోని ఒమెరియా గార్దెన్ లో శుక్రవారం సాయంత్రం ఈ వేడుకలు జరిగాయి.

ఆ పార్టి కువైట్ శాఖ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు అధ్వర్యములో తెలుగు దేశం, నందమురి, నారా మరియు పరిటాల అభిమానులతో పాటు వివిధ తెలుగు సంఘాల నాయకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేసారు.

 kuwait tdp celebrates the victory of nandyala and kakainda elections

నంద్యాల ఉప ఎన్నికల కోసం కువైట్ నుండి ప్రతేకంగా 30 మంది సభ్యుల టీమ్ వెళ్లి అక్కడ ప్రచారం నిర్వహించింది. ఆగష్ట్ 14 మరియు 15 తేదీలలో ఈ ప్రచారం నిర్వహించారు.

కార్యక్రమంలో ప్రధాన కార్యదర్సి కొత్తపల్లి మోహన్ బాబు మాట్లాడుతూ ఆంధ్ర ఫ్రదేశ్ ప్రజలకు చంద్రబాబు గారి మీద వున్న నమ్మకం తోనే ఈ ఘనమైన విజయం సాధ్యమైందన్నారు.అలాగే పి.అర్.వో ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు గారు దేశం లోనే నెంబరు వన్ సి.ఎం అని ఆయన ఏ.పి. కి ఒక అదృష్టమని కొనియాడారు.

ఈ వేడుకలలో తెలుగు దేశం కార్యవర్గం రహమతుల్ల, రాధమాధవ్, ముస్తాక్, చొటు, కరీం, సూర్యనారాయణ,, పోలిన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+