• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డల్లాస్, న్యూజెర్సీల్లో వేడుకలా యోగా డే(ఫొటోలు)

|

డల్లాస్: మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజిఎంఎన్‌టి), ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఇర్వింగ్ సిటీలోని థామస్ జాఫర్సన్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. వాతావరణం అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ 500మందికి పైగా డల్లాస్ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు.

ఎంజిఎంఎన్‌టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శబ్నమ్ మోద్గిల్ ఎంజిఎంఎన్‌టి సెక్రటరీ రావు కల్వలను స్వాగతోపన్యాసంలో పరిచయం చేశారు. గాంధీ కూడా మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం అభ్యసించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రావు కల్వల మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 350 మిలియన్ల ప్రజలు యోగా చేస్తున్నారని, అమెరికాలోనే 35 మిలియన్ల మంది యోగా చేస్తున్నారని చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంజిఎంఎన్‌టి ఛైర్మన్ ప్రసాద్ తోటకూరను ఆయన అభినందించారు. ఎంజిఎంఎన్‌టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తయాబ్ కుందవాలా .. కాన్సుల్ ప్రతినిధి ఆర్‌డీ జోషీ, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా(హూస్టన్, అమెరికా) అనుపమ్ రేలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ.. అంతర్జాతీయ దినోత్సవంగా యోగా జరుపుకోవాలని భారత్ కోరగా.. అందుకు 175 దేశాలు అంగీకరించాయని తెలిపారు. దీంతో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిందని తెలిపారు.

MGMNT organized International Day of Yoga in Dallas

శబ్నమ్ మోద్గిల్.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీధర్ తుల్జారాం, డా. నిక్ ష్రాఫ్, సపన్, ఇతర వాలంటీర్లను పరిచయం చేశారు. నిత్య జీవితంలో యోగా ఎంత ప్రాముఖ్యమనే విషయాన్ని శబ్నమ్ మోద్గిల్ వివరించారు. ప్రాణాయామం, యోగసనాలు, ధ్యానం లాంటి అంశాలపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందం వివరించింది.

200లకుపైగా కార్యక్రమాలకు సహకరించిన కమ్యూనిటీ వాలంటీర్ నగేష్ దిండికుర్తి ఈ సందర్భంగా ఎంజిఎంఎన్‌టి అభినందించింది. అదేవిధంగా టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్ విషయంపై చర్చించారు.

ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి ఎంజిఎంఎన్‌టి కో-ఛైర్మన్ ఇందు మందాడి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే అక్టోబర్ 2న నిర్వహించతలపెట్టిన గాంధీ పీస్ వాక్ లో పాల్గొనాలని కోరారు.

న్యూజెర్సీలో యోగా డే

న్యూ జెర్సీ: జూన్ 21న రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ కాన్సుల్ జనరల్, ఇండియన్ కాన్సులేట్(న్యూయార్క్, యూఎస్ఏ), ఉపేంద్ర చివుకుల(అమెరికా కాంగ్రెస్ మెన్)తో పాటు సుమారు 600ల మందికిపైగా పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు విస్తృత ప్రచారం

కల్పించడం, యోగా గొప్పదనాన్ని విశ్వ వ్యాప్తం చేయడం, యోగా పుట్టింది భారతదేశంలోనే, యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించే సందర్భంలో తాము పొందే అనుభూతిని వర్ణించలేమని చెప్పారు.

MGMNT organized International Day of Yoga in Dallas

192 దేశాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుతున్నారని, భారత వారసత్వ సంపదైన యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రపంచాన్ని శాంతి, సామరస్య మార్గంలో నడిపించడానికి యోగానే సరైన మార్గమని అన్నారు. యోగా ఏ మతానికో, ప్రాంతానికో సంబంధించిన అంశం కాదన్నారు. శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసి మన వాస్తవ శక్తిని తెలియచేసే శాస్త్రీయ విధానమని పేర్కొన్నారు.

సురక్షిత, ఆరోగ్య, సంతోషమైన ప్రపంచం కోసం అందరం ఏకమవ్వాల్సి ఉందని అన్నారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన ఎన్నో కానుకల్లో అపూరుపమైనది యోగా అని, ప్రతి ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా

జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించిందని తెలిపారు.

యోగా ఏనాడో మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తమైంది. పతంజలి మహర్షి సూచించిన అష్టాంగ యోగ సూత్రాల నుండి రూపు దిద్దుకున్న యోగాకు అధికారికంగా ప్రపంచ గుర్తింపు రావడం భారతీయులుగా మనందరికీ గర్వకారణమని అన్నారు.

MGMNT organized International Day of Yoga in Dallas

యోగాలో ప్రధానంగా కనిపించేవి ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, ముద్రలు,క్రియలు, ఆసనాలు.. ఇందులో అనేక ఆసనాలు కనిపిస్తున్నా ప్రధానంగా 25వరకూ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆసనాలు వేయడం వల్ల తల నుండి కాలి చిటికన వేలు వరకూ మన శరీరమంతా చురుగ్గా పని చేస్తుంది.

'శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడం కోసం జిమ్ములు, ఆరోబిక్స్, ఇతర పాశ్చాత్య వ్యాయామాల కోసం డబ్బును ఖర్చు చేస్తున్నాం.. కానీ యోగాకు ఇవేమీ అవసరం లేదు. చక్కగా మీ ఇంట్లో, లేదా శుద్దమైన గాలి, వెలుతురుసక్రమంగా ఉన్న తగిన చోటు చూసుకొని ఆసనాలు వేసుకోవచ్చు. అందరూయోగాసనాలు వేయండి.. సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి.. యోగాతోరోగ రహిత సమాజాన్ని రూపొందిద్దాం' అని తెలిపారుఈ కార్యక్రమంలో హిందూ స్వయం సేవక్ అమెరికా , ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనత పార్టీ మిత్ర బృందం , ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఏకల్ విద్యాలయ , ఇండియన్ బిజినెస్ కమ్యూనిటీ ,సేవ అమెరికా , ఇషా ఫౌండేషన్ , విశ్వా హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా, విహంగ యోగా, తెలుగు సంఘాలు , తెలంగాణ

సంఘాలు, మిగితా కమ్యూనిటీ లోకల్ సంస్థలు పాల్గొన్నాయి.

ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎలౌజి రావ్ , నిమేష్ దీక్షిత్ , కేశవ్ దేవ్ , శేకర్ కాకర్ల, రఘు, కృష్ణ రెడ్డి అనుగుల, అరవింద్ మోదిని, రాఘవీర్ ,విజయ్ మల్లం పాటి, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ , రామ్ వేముల , ప్రదీప్, కిశోర్ , విశ్వ జిత్, తదితరలు పాల్గొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahatma Gandhi Memorial of North Texas (MGMNT) in association with Art of Living (AOL) organized the first “International Day of Yoga” at Mahatma Gandhi Memorial, Thomas Jefferson Park, in Irving City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more