అమెరికాలో భారత గణతంత్ర ఉత్సవం
న్యూజెర్సీ: అమెరికాలోని భారత ముస్లింలు ఫిబ్రవరి 1వ తేదీన భారత గణతంత్ర దినోత్సావాలను జరుపుకున్నారు. ఇండియన్ అమెరికన్ ముస్లిమ్ కౌన్సిల్ న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి మిడిల్‌సెక్స్ కౌంటీ 12వ కాంగ్రెసునల్ డిస్ట్రిక్ట్ గౌరవ ప్రతినిధి రుష్ హోల్ట్ ప్రధాన వక్తగా హాజరయ్యారు.
ముస్లింలతో పాటు వివిధ విశ్వాసావకు చెందిన 160 మంది ఇండియన్ అమెరికన్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత రాజ్యాంగం అద్భుతమైన పత్రమని, అన్ని వర్గాల పౌరులకు సమానత్వాన్ని, న్యాయాన్ని, స్వేచ్ఛను ప్రసాందించే విధంగా భారత రాజ్యాంగం రూపొందిందని ఇండియన్ అమెరికన్ ముస్లిమ్ కౌన్సిల్ న్యూజెర్సీ చాప్టర్ అధ్యక్షుడు మిన్హాజ్ ఖాన్ అన్నారు.

జాతి, మత, కుల వివక్షలకు అతీతంగా భారత రాజ్యాంగం పౌరులందరూ కలిసి జీవించే హక్కును ప్రసాందించిన ఏకైక దేశం భారత్ అని ఆయన అన్నారు.
ఇండియన్ అమెరికన్లుగా అమెరికాను ప్రశంసిస్తూనే భారత రాజ్యాంగాన్ని కూడా కొనియాడుతామని, ఇరు దేశాల ఆదర్శాలను నిలబెట్టే బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications