బ్రిటన్ పార్లమెంట్‌ను సందర్శించిన గణేశ్ గుప్తా
లండన్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మల్యే గణేశ్ బిగాల తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా బ్రిటన్‌లోని లండన్ నగరంను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా నేడు బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన ఎంపీ, అఖిలపక్ష ఇండో-బ్రిటన్ ఎంపీల ఛైర్మన్ వీరేంద్ర శర్మ ఆహ్వానం మేరకు పార్లమెంట్‌ను సందర్శించారు.
ముందుగా శర్మ.. పార్లమెంట్‌లోని వివిధ విభాగాలను దగ్గరుండి చూపించి వాటి చరిత్రను వివరించారు. ఆ తర్వాత బ్రిటన్ రాజకీయ వ్యవస్థ-పరిపాలన విధానాల గురించి వివరించారు.

ఎమ్మల్యే గణేశ్ బిగాల మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర అభివృద్ది, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ గురించి వివరించారు. ఇటీవల
రాష్ట్రం సాధించిన విజయాల గురించి తెలిపారు. వీరేంద్ర శర్మ స్పందిస్తూ.. తాను తెలంగాణ రాష్ట్రం గురించి వింటున్నానని, ఇటీవల ఆపిల్ సంస్థ తన డెవెలప్‌మెంట్ సెంటర్‌ను హైద్రాబాద్‌లో పెట్టిన విషయం గుర్తు చేశారు.
అంతేగాక, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపంచారు. చివరిగా వీరేంద్ర శర్మ
తెలంగాణా రాష్ట్రానికి రావాల్సిందిగా ఎమ్మల్యే గణేశ్ బిగాల ఆహ్వానించారు. ఈ పర్యటనలో ఎమ్మెలే గణేశ్ బిగాలతో పాటు, వారి సోదరుడు మహేష్ బిగలా,
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, తెలంగాణ ఎన్నారై ఫోరం-హెడ్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్ ఉదయ్ నాగరాజు, ఎన్నారై టిఆర్ఎస్ సెల్ సెక్రెటరీ నవీన్ రెడ్డి, ఎమ్మల్యే కుటుంబసభ్యులు ఉన్నారు.












Click it and Unblock the Notifications