టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి: ఎన్నారై సెల్

లండన్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఎన్నారైలకు పిలుపునిచ్చింది. ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో లండన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సెల్ సభ్యులతోపాటు పలువురు ఎన్నారై నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్దులను గెలిపిస్తే మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చని టిఆర్ఎస్ ఎన్నారై సభ్యులు తెలిపారు. 60 ఏళ్లలో జరుగని అభివృద్ధిని కేవలం ఎనిమిది నెలల్లో చూపిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతగా టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్దులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దేవీప్రసాద్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి దూసరి అశోక్ గౌడ్.. సెల్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు.

NRIs Call to vote for TRS MLC candidates by NRI TRS CELL

ఉద్యమ బిడ్దలని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణా బిడ్డ‌పై ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణా బిడ్డలు సైతం ముందుకు రావాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న తమకుటుంబ సభ్యులకి, మిత్రులకీ ఫోన్ చేసి టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్దులను గెలిపించేలా బాధ్యత తీసుకోవాలని కోరారు.

కాగా, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దూసరి అశోక్ గౌడ్‌తోపాటు ఎన్నారై టిఆర్ఎస్ కార్యదర్శి నవీన్ రెడ్డి, యుకె అండ్ యూరోప్ ఇంఛార్జ్ విక్రమ్ రెడ్డి రేకుల, లండన్ ఇంఛార్జ్ రత్నాకర్ కదుదుల కడుడుల కదుదుల, అధికార ప్రతినిధి శశిధర్ చిట్లపల్లి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+