వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై పాలసీ ప్రకటించాలి: టీపీసీసీ ఎన్నారై సెల్

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: నాలుగేళ్లు కావస్తున్నా ప్రభుత్వం ఎన్నారై పాలసీ పై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో సగం పేజీ లో చెప్పిన ఎన్నారై పాలసీపై అరచేతిలో వైకుంఠాన్ని చూపి నేడు ఎన్నారై లను పట్టించుకుంటలేదని లండన్ ఎన్నారైలు విమర్శించారు.

2016 జులైలో అట్టహాసంగా ,విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఎన్నారై పాలసీపై ఆశలు రేకెత్తించి 2 ఏండ్ల వరకు కోల్డ్ స్టోరేజ్ లో పడేశారని, గల్ఫ్ నుండి ఏడాది కి 500 మంది చనిపోయి వారి పార్థివ దేహాలు తీసుకువస్తే తెల్లకార్డు పేరున అవస్థ లకు గురి చేస్తున్నారని అన్నారు.

NRIs demand TRS governmet to announce NRI policy

టీపీసీసీ సలహా సభ్యుడు గంగసాని ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ - ఎన్నారై మంత్రి కెటి రామారావు తెలంగాణ సాకారం చేసిన కాంగ్రెస్‌ను లోఫర్ అనడం ఖండిస్తూ 4 ఇళ్లు అయిన న ఎన్నారై పాలసీ ప్రకటించకుండా విదేశీ పర్యటనలు చేస్తున్న మంత్రి కేటీర్ జోకర్ అని విమర్శించారు .

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యదర్శి ,టీపీసీసీ ఎన్నారై సెల్ ,కన్వీనర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ - వలస బాధితులు ఏజంట్ ల చేతి లో మోస పోవడాన్ని అరికట్టడం లో ప్రభుత్వం విఫలం అయిందని , ఎన్నారై సంక్షేమం పై చిత్తశుద్ధి లేదని అన్నారు

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎన్నారై సెల్ కో కన్వీనర్ సుధాకర్ గాడ్ మాట్లాడుతూ - పార్లమెంట్ లో తెలంగాణ ప్రక్రియ పై పార్లమెంట్ ను అవమానకరం గ మాట్లాడిన ప్రధాని మోడీ ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలిసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ను విమర్శించడం తగదని అన్నారు ,

NRIs demand TRS governmet to announce NRI policy
దళితులకు అధికారం పేరున గద్దెనెక్కి మోసం చేసిన కేటీర్ మీ కుటుంబమే లోఫర్ అని అన్నారు ,బిసి లకు రాజ్యాధికారం అందకుండా ,ఉన్నత స్థాయి కి వెళ్లకుండా గోర్లు ,బర్లు అని అనడం కుట్రలో భాగమేనని ఎద్దేవా చేశారు

ఎన్నారై సెల్ కో కన్వీనర్ చిట్టెం అచ్యుత రెడ్డి మాట్లాడుతూ - ఎన్నారై పాలసీ ప్రకటించక పోవడం వాళ్ళ గల్ఫ్ ఎన్నారైలు ఎన్నో అవస్థలు పడుతున్నారని నారాయణపేటకు సంబంధించి గల్ఫ్ ఎన్నారై సౌదీ లో చనిపోయి 15 రోజులు అయినా కూడా పార్దీవ దేహాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని విమర్శించారు .

కోర్ సభ్యులు బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ - ఎన్నారై మంత్రి కేటీర్ ట్విట్టర్ పిట్ట కబుర్లు అపి ఎన్నారై పాలసీ ప్రకటించి గల్ఫ్ ఎన్నారైలకు న్యాయం చేయాలని అన్నారు. కోర్ సభ్యులు జాన్సర్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ఎన్నారై మంత్రి కేటీర్ విదేశీ పర్యటన పై శ్వేత పత్రం సమర్పించాలని డిమాండ్ చేసారు.

English summary
London NRIs and TPCC cell members demanded Telangana governmen to announce NRI policy soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X