ముస్లింలకు లండన్ ఎన్నారైల ఇఫ్తార్ విందు
లండన్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఎన్నారై ఫోరం, ఎన్నారై తెరాస విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నారైలు ముస్లిం సౌదరులకు ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చారు. స్థానిక హౌంస్లౌ మల్టీ కల్చర్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ విందుకు హాజరైన తెలంగాణా ఎన్నారై ఫోరం ప్రతినిధులు, ఎన్నారై తెరాస విభాగం ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

తెలంగాణా ఎన్నారై ఫోరం ప్రెసిడెంట్ సీకా చంద్ర శేఖర్ ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణా ఏర్పడినాక ముస్లిం సోదరులు చేసుకుంటున్న మొదటి రంజాన్ పర్వదినానికి ఇఫ్తార్ విందు ఇవడం చాల ఆనందంగా ఉందని చెప్పారు. ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకు సంస్థ ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉంటుందని చెబుతూ వారితో ఉన్న సంవత్సరాల అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు .
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉపాధి రంగంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని, దీన్ని కచ్చితంగా తమ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎన్నారై తెరాస విభాగం ప్రెసిడెంట్ అనిల్ కుర్మాచలం చెప్పారు

ఈ కార్యక్రమంలో బిల్లాల్ బిన్ అబ్దుల్,మహమూద్ అబ్దుల్, మాలిక్, నవాజ్, సయీద్ సయెద్, తెలంగాణా ఎన్నారై ఫోరం ప్రెసిడెంట్ సీకా చంద్ర శేఖర్, ఎన్నారై తెరాస విభాగం అద్యక్షుడు అనిల్ కుర్మాచలం, సలహాదారు ఉదయ నాగరాజు, అశోక్ దుసరి, నవీన్ రెడ్డి, సుమన్ గోలి, నరేష్, కిశోర్, రంగు వెంకట్, శశిధర్, ప్రణీత్ పాల్గొన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications