ఘనంగా స్కాట్లాండ్ తెలుగు సంఘం ఉగాది వేడుకలు

Subscribe to Oneindia Telugu

లండన్: స్కాట్లాండ్‌లోని తెలుగు ప్రవాసులు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్కాట్లాండ్ తెలుగు సంఘం(టాస్) ఆధ్వర్యంలో శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం(ఏప్రిల్ 07న)నాడు ఎడింబరొ - డల్కిత్ హై స్కూల్ ప్రాంగణం ఆడిటోరియంలో వైభవంగా జరిగాయి.

టాస్ కార్యవర్గ సభ్యులు వేడుకలకు విచ్చేసిన వారందరికీ చక్కని ఉగాది పచ్చడి అందించి స్వాగతం పలికారు. షడ్రుచుల పిండివంటలతో కూడిన విందుతో మొదలైన మధ్యాహ్నం.. జ్యోతి ప్రజ్వళనతో టాస్ కార్యవర్గం సభ్యులను, ప్రముఖులను స్వాగతించారు. స్థానికంగా ఉన్న తెలుగు వారి పిల్లలచే సంస్కృత శ్లోకాలు, వేమన పద్యాలు, సాంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యంతో మెళవించిన కార్యక్రమం ఆహుతులను ఆశ్చర్యపరిచారు.

scotland telugu association Ugadi celebrations

సభాపతి సత్య శ్యాంకుమార్ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సభ్యులను స్వాగతిస్తూ, తెలుగు వారిగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవలసిన బాధ్యత మనదేననీ, అందుకు ఇలాంటి వేడుకలు వేదిక అనీ అన్నారు, టాస్ ధ్యేయం చేపట్టే వివిధ కార్యక్రమాల గురించి విశదీకరించారు.

scotland telugu association Ugadi celebrations

ఈ సందర్భంగా ఆధ్యక్షుడు నాగుబండి రంజిత్ తెలుగు భాష ప్రత్యేకతను తెలియజేసే సిలికాన్ ఆంధ్ర మనబడి ఎక్కువగుణములు(మార్కులు) సాధించిన చిన్నారులకు, పురస్కారం, బహుమతులతో ప్రోత్సహించారు. స్కాట్లాండ్‌లోని తెలుగు వారి పిల్లలు అందరూ తెలుగు నేర్చుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో తదుపరి భాగంగా టాస్ నూతన కార్యవర్గ (2018 - 2020) సభ్యుల ఎన్నికను పొందుపరిచారు.

scotland telugu association Ugadi celebrations

- జయంతి సత్య శ్యాం కుమార్ - సభాపతి (ఛైర్మన్)
- కెంబూరి మైథిలి - ఆధ్యక్షుడు (ప్రెసిడెంట్)
- చింపిరి శివ - ప్రధాన కార్యదర్శి (జెనరల్ సెక్రటరీ)
- గడ్డం వెంకటేష్ - కోశాధ్యక్షుడు (ట్రెజరర్)
- కుచాడి ఉదయ్ కుమార్ - సాంస్కృతిక కార్యదర్శి (కల్చరల్ సెక్రెటరి)
- అప్పరల రవి తేజస్వి - మహిళా కార్యదర్శి (విమెన్స్ సెక్రెటరి)
- ప్రతిపటి చైతన్య - సాంకేతిక & (ఐ. టి. సెక్రెటరి)
- నూక నిరంజన్ - పౌర సంబంధాల కార్యదర్శి (పి. ఆర్ సెక్రెటరి)
- నరుకుళ్ళ రంగనాథ్ - క్రీడా కార్యదర్శి (స్పోర్ట్స్ సెక్రెటరి)
- అప్పరాల మాధవీ లత - ప్రాజెక్టుల కార్యదర్శి

తదుపరి చింపిరి శివ తెలిపిన కృతజ్ఞతల ఓటు తో పాటు మన జాతీయ గీతం "జన గణ మణ" వందన సమర్పణ తొ స్కాట్లాండ్ తెలుగు సంఘం (టాస్) ఉగాది 2018 వేడుకలు ముగిశాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Scotland Telugu Association Ugadi celebrations held on April 07th.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి