షాకింగ్: అడవిలో గాయపడి 3 రోజులు పాకి వచ్చాడు
కౌలాలంపూర్: మలేసియాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. 33 ఏళ్ల భారతీయ వ్యక్తి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మూడు రోజుల పాటు మలేసియాలోని అడవిలో పాకుతూ సహాయం కోసం సురక్షితమైన చోటికి చేరుకున్నాడు.
ఆ కారు ప్రమాదంలో మరో భారతీయుడు మరణించాడు. ప్రమాదం గత ఆదివారం మధ్య మలేసియాలోని బీదోర్‌లో జరిగింది. కారును నడుపుతున్న నికోలస్ ఆండ్ర్యూ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు 20 మీటర్ల లోతు గల లోయలోకి జారిపడింది.

ఆ ప్రమాదంలో ఆండ్ర్యూ కుడి చేయి, కాలు విరిగాయి. దీంతో అతను ప్రవాహంతో పాటు పాకుతూ ముందుకు సాగాడు. అతని మిత్రుడు ఆర్ త్యాగరాజన్ (34) అక్కడికక్కడే మరణించాడు. తాను ప్రవాహంలోని నీటిని మాత్రమే తాగానని, మూడు రోజుల పాటు చెట్ల కింద నిద్రపోయానని నికోలస్ చెప్పాడు.
తన సోదరుడు వివాహం కార్డులు పంపిన తర్వాత తాను ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని, అయితే తాను నియంత్రణ కోల్పోవడంతో కారు లోయలో పడిపోయిందని అతను వివరించాడు. లోయలోంచి పైకి రావడానికి ప్రయత్నించానని, అయితే గాయాల కారణంగా సాధ్యం కాలేదని అతను చెప్పాడు. దాంతో తాను పాకుకుంటూ రావడమే మంచిదని భావించానని అతను చెప్పిటన్లు న్యూ స్ట్రెయిట్స్ టైమ్స్ రాసింది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications