వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పెల్లింగ్ బి పోటీలో పిల్లల ప్రతిభ

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్ డోనాల్డ్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన స్పెల్లింగ్ బి పోటీలో భారత్‌కు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. రిచర్డ్‌సన్‌లోని సివిక్ సెంటర్‌లో నవంబర్ 9న మెక్ డోనాల్డ్ నిర్వహించిన ఉచిత విద్య వర్క్‌షాప్ సెమినార్‌లో సౌత్ ఏసియన్ మిడిల్, హైస్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కాగా సదరన్ న్యూస్ గ్రూప్, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సి) ఈ కార్యక్రమం నిర్వహణలో భాగస్వామిగా ఉంది. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో గల విద్యా పరమైన అవకాశాలను తెలుసుకునేందుకు దక్షిణాసియాకు చెందిన విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సదరన్ మెథోడిస్ట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్(ఆస్టిన్), యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్(ఆర్లింగ్టన్), హోస్టన్ యూనివర్సిటీల నుంచి వచ్చిన ఎడ్యుకేషనల్ కౌన్సిలర్స్ విద్యార్థులు, తల్లిదండ్రులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అంతేగాక అడ్మిషన్ ప్రక్రియ, ఆర్థిక సహాయం పొందే అవకాశాల గురించి వారికి కౌన్సిలర్లు వివరారు.

Students of Telugu origin showed their talent in Spelling Bee

కార్యక్రమంలో ఎస్ఎంయూ/అడ్మిషన్ డీన్ వేస్ వేగొనర్, కె-12 కాలేజ్ బోర్డు ఎడ్యుకేషనల్ మేనేజర్ లానా సవేడలు అమూల్యమైన తమ సందేశాన్ని ఇచ్చారు. సదరన్ న్యూస్ గ్రూప్ ఛైర్మన్, సిఈఓ వియా హెచ్. లీ, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ కో-ఆర్డినేటర్ ప్రసాద్ తోటకూరలు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సీనియర్ (4వ డ్రేడ్ నుంచి 8 గ్రేడ్ వరకు), (కిండర్ గార్టెన్-3వ గ్రేడ్) జూనియర్ స్టూడెంట్స్‌కు ప్రిస్మ్ అకాడమీ డైరెక్టర్ సుజనా పాలూరి, ఐఏఎఫ్ సి డైరెక్టర్ సుష్మి కోసూరిలు స్పెల్లింగ్ బి పోటీలను నిర్వహించారు.

ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రసాద్ తోటకూర, వియా హెచ్. లీ, సుజనా పాలూరిలు నగదు బహుమతిని అందజేశారు. ఈ బహుమతులను మెక్ డోనాల్డ్ కంపెనీ స్పాన్సర్ చేసింది. విజేతల వివరాలు..

జూనియర్ కేటగరి: ప్రథమ బహుమతి జులియా డాన్, ద్వితీయ బహుమతి ఇసాబెల్ వాంగ్, రుషికేశ్ శ్రీరంగం తృతీయ బహుతి అందుకున్నారు.

సీనియర్ కేటగిరి: ప్రథమ బహుతి విట్టల్ కోమండమూరి, ద్వితీయ బహుమతి ఆమి లియూ, తేజశ్విని తుమ్మూరుకు తృతీయ బహుమతి లభించింది. కార్యక్రమ నిర్వహకులు ఏంజెల చెన్, సుజనా పాలూరి, సుష్మి కోసూరి, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఐఏఎఫ్‌సి కో-ఆర్డినేటర్ ప్రసాత్ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Students of Telugu origin showed their talent in Spelling Bee hosted by McDonald in Dallas, TX: McDonald, the World renowned fast food chain, hosted a Free Education Workshop Seminar for South Asian Middle and High School.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X