సూడాన్ ఘర్షణలు: బుల్లెట్ గాయాలతో భారతీయుడు మృతి
ఖార్తూమ్: ఆఫ్రికాలోని సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగిన క్రమంలో ఆ దేశంలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది. తాజాగా, రాజధాని ఖార్తూమ్ సహా అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 56 మంది మరణించారు. అయితే, ఈ వీరిలో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు.
ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. సూడాన్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న భారత జాతీయుడు ఆల్బర్ట్ ఆగస్టీన్ బుల్లెట్ గాయాలతో మరణించినట్లు సమాచారం అందిందని భారతీయ రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా పేర్కొంది. తదుపరి ఏర్పాట్లపై మృతుడి కుటుంబసభ్యులు, స్థానిక అధికారులతో సంప్రదించినట్లు తెలిపింది. మృతుడి స్వస్థలం కేరళలోని కన్నూర్.

ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సంతాపం వ్యక్తం చేస్తూ.. 'ఎంబసీ ఆ కుటుంబానికి పూర్తి సహాయాన్ని అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఖార్టూమ్‌లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. మేము పరిణామాలను పర్యవేక్షిస్తూనే ఉంటాము' పేర్కొన్నారు.
Deeply grieved to learn about the death of an Indian national in Khartoum. The Embassy is making all efforts to extend fullest assistance to the family.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 16, 2023
The situation in Khartoum remains one of great concern. We will continue to monitor developments. https://t.co/GJ9iFowLwu
పారామిలిటరీ(ఆర్ఎస్ఎఫ్) ని సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనే సూడాన్‌లో ఘర్షణలు దారితీసింది. ఈ విషయంపై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారా మిలిటరీ కమాండర్ మహ్మద్ హుందాన్ డగ్లో మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆర్మీ, పారామిలిటరీ బలగాలు ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సూడాన్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటికి రావొద్దని భారత దౌత్య కార్యాలయం శనివారం హెచ్చరికలు జారీ చేసింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications