స్వదేశానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న ఎన్ఆర్ఐలు, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎన్ఆర్ఐలు స్వదేశానికి వచ్చేందుకు ఆసక్తిని చూపుతున్నారని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన రెండు సర్వేలు ఇదే రకమైన నివేదికలను వెల్లడించాయి.

ఓ సర్వే నివేదిక ప్రకారంగా సుమారు 44 శాతం మంది ఇండియన్లు అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వెళ్ళేందుకు ఆసక్తిని చూపుతున్నారని సమాచారం.

Survey: NRIs like to return home

మరోవైపు హర్వార్డ్ లా స్కూల్ సర్వే కూడ ఇదే రకమైన నివేదిక ఇచ్చింది. ఈ సర్వే నివేదిక ప్రకారం సుమారు 50 శాతం మంది ఎన్ఆర్ఐలు అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

ఇండియా నుండి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశాలు గణనీయంగా పడిపోయాయని ఓ సర్వే నివేదిక వెల్లడిస్తోంది. ఈ సర్వే నివేదిక ప్రకారంగా సుమారు 20 శాతం గల్ప్ దేశాల్లో ఉద్యోగావకాశాలు పడిపోయాయని ప్రకటించారు.

అయితే జర్మనీ, ఐర్లాండ్ దేశాల్లో ఉద్యోగావకాశాలు సుమారు 10 శాతం పెరిగాయనే సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.అమెరికా బోస్టన్‌లో నివాసం ఉండే టెక్కీ గౌరీ డానీ మాత్రం తాము అమెరికా నుండి స్వదేశానికి వెళ్ళాలని భావిస్తున్నట్టు చెప్పారు.

అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనకు భయపడో, జాతి వివక్ష గొడవలకు భయపడో కాదని ఆమె చెప్పారు.అయితే అమెరికాలో సుదీర్ఘ కాలం పనిచేసినవారు కొందరు ఇండియాకు వచ్చేందుకు ఆసక్తిని చూపుతున్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

అమెరికాలోని ఐటీ కంపెనీల్లో అత్యున్నత స్థాయిలో కొనసాగిన వారు ఇండియాలో స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసుకొనేందుకు ఆసక్తిని చూపుతున్నారని ఓ సర్వే నివేదిక వెల్లడించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two global surveys on NRIs revealed that majority of them pamper the idea of turning their steps back to their motherland.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి