వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిన్సినాటిలో తెలంగాణ వేడుకలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హామిల్టన్: గ్రేటర్ సిన్సినాటి తెలంగాణ అసోసియేషన్(జిసిటిఏ) ఆధ్వర్యంలో తొలి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు సిన్సిన్నాటి‌లోని వెస్ట్ చెస్టర్ కన్వెన్షన్ సెంటర్లో జూన్ 7వ తేదీన వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో సిన్సినాటి, డేటన్, నార్తర్న్ కెంటకీకి చెందిన సుమారు 200 మంది తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు.

ముందుగా ప్రసాద్ మీగడ ఆధ్వర్యంలో తెలంగాణ పిత ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించారు. అనతరం వాసవి బోయినపల్లి, శ్వేత నాగులవంచ ‘జయ జయహే తెలంగాణ' గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ఆరంభించారు.

అవతరణ దినోత్సవం సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యఅతిథిగా పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, కేజీ టు పీజీ విద్యా విధానం గురించి ప్రవాస తెలంగాణ వాసులకు వివరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నేప్రభాకర్, దేవీప్రసాద్ వీడియో మెసేజ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం నిర్వహించిన క్విజ్ కార్యక్రమం చిన్న పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులను అభినందించారు. కార్యక్రమ విజయవంతానికి కార్యవర్గ సభ్యులు గణేష్ కోట, పురమ రెడ్డి, రవి గుమ్మడవల్లి, లక్ష్మి రెడ్డి, సీతారాం, విష్ గట్ల, సురేష్, కృష్ణ, కిరణ్, భాను, నరసింహ, చారిలు కృషి చేశారు.

వేడుకలు

వేడుకలు

గ్రేటర్ సిన్సినాటి తెలంగాణ అసోసియేషన్(జిసిటిఏ) ఆధ్వర్యంలో తొలి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు సిన్సిన్నాటి‌లోని వెస్ట్ చెస్టర్ కన్వెన్షన్ సెంటర్లో జూన్ 7వ తేదీన వైభవంగా జరిగాయి.

వేడుకలు

వేడుకలు

ఈ వేడుకల్లో సిన్సినాటి, డేటన్, నార్తర్న్ కెంటకీకి చెందిన సుమారు 200 మంది తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు.

వేడుకలు

వేడుకలు

ముందుగా ప్రసాద్ మీగడ ఆధ్వర్యంలో తెలంగాణ పిత ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించారు.

వేడుకలు

వేడుకలు

అనతరం వాసవి బోయినపల్లి, శ్వేత నాగులవంచ ‘జయ జయహే తెలంగాణ' గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ఆరంభించారు.

English summary
Telangana Formation day celebrations have been held in cincinnati by Greater Cincinnati Telangana Association.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X