అమెరికాలో ఎన్నారై వాలీబాల్ టోర్నీ

న్యూయార్క్: అమెరికాలోని మేరీలాండ్‌లో నివాసముంటున్న ప్రవాస భారతీయ వాలీబాల్ ఆటగాళ్లందరూ కలిసి 2012లో క్లాప్(కెఎల్ఎపి) సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. వాలీబాల్ ఆటగాళ్లందరూ కూడా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన వారు. అందుకే ఈ సంస్థకు రెండు రాష్ట్రాల్లోని పదాలను చేర్చి క్లాప్(కెఎల్ - కేరళ, ఏపి - ఆంధ్రప్రదేశ్) గా నామకరణం చేశారు.

వాలీబాల్ ఆటను ఉత్సాహంగా నిర్వహించడం, ఆటగాళ్ల మధ్య అనుబంధాలను పెంపొందించడం.. క్లాప్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అంతేగాక భారతదేశం నుంచి వచ్చిన యువతకు వాలీబాల్ ఆటలో శిక్షణను అందించనున్నట్లు చెప్పారు. భవిష్యత్ తరాలకు ఈ ఆట ప్రాధాన్యతను తెలియజేయనున్నట్లు వారు తెలిపారు.

ALL indian Tournament in North America

ఉత్తర అమెరికాలో నవంబర్ 9న రెండో వార్షిక క్లాప్ వాలీబాల్ టోర్నమెంట్ 2013ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు టోర్నమెంట్ జరుగుతుందని వారు తెలిపారు. ఈ టోర్నమెంట్ మేరీలాండ్‌లోని బల్టిమోర్ వాలీబాల్ హౌజ్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉత్సాహవంతులు అక్టోబర్ 30లోపు తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.

టోర్నమెంటులో విజేతలకు 2వేల డాలర్లు, ద్వితీయ స్థానం పొందిన వారికి వెయ్యి డాలర్లు అందించనున్నట్లు నిర్వాహకులు శ్రీనివాస చందు తెలిపారు. వివరాల కోసం వెంకటరెడ్డి-703-786-6886, రామారావు 248-982-7388, జాన్సన్-202-445-7379, విజయ్-301-910-6876, బెన్ని- 410-302-5973, (www.klapvolleyball.com)లను సంప్రదించవచ్చని వారు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+