NRI News: సొంతూరులో లైబ్రరీ ఏర్పాటు చేసిన ఎన్నారైలు..

తను పుట్టి పెరిగిన ఊరుకు ఎదైనా చేయాలని చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడ్డవారుత తమ మాతృభూమి కోసం ఎదైనా చేయాలని చూస్తారు. తాజాగా బ్రిటన్ లో స్థిరపడిన వైద్యులు మందుమాల మాధవి రెడ్డి, ఆమె భర్త శ్రీకాంత్ తమ ఊరిలో లైబ్రరీ కట్టించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని జిల్లా పరిషత్ ఆవరణలో అత్యాధునిక సైన్స్ బ్లాక్, లైబ్రరీ భవనాన్ని నిర్మించారు.

డాక్టర్ మాధవి మాసాయిపేట గ్రామానికి చెందిన రైతు దంపతులు అంతిరెడ్డిగారి కేశవ రెడ్డి, రామలక్ష్మి దంపతుల కుమార్తె. ఆమె బాగా చుదువుకుని డాక్టర్ అయ్యారు. పుట్టిన ఊరికి ఎదైనా చేయ్యాలనే సంకల్పంతో వివిధ సంస్థల సహకారంతో వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నారు. మాధవి మూడేళ్ల క్రితం పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక పాఠశాలకు రంగులు వేయడమే కాకుండా ఫర్నీచర్, స్పోర్ట్స్ మెటీరియల్స్, సైన్స్ ల్యాబ్ పరికరాలను డాక్టర్ మాధవి అందజేశారు.

The NRIs who settled in London established a library in their hometown

ఉపాధ్యాయులు, విద్యార్థులు తమకు లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ కోసం భవనం కావాలని కోరారు. మాధవి స్థానిక స్వచ్ఛంద సంస్థ డాక్టర్ సుగుణ రామ్ మోహన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, యూకేలో ఉన్న మూడు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, అవి లయన్స్ క్లబ్ ఆఫ్ ఎన్‌ఫీల్డ్, ఎంపవర్‌మెంట్ త్రూ ఎడ్యుకేషన్, శాంత ఫౌండేషన్‌తో కలిసి భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తయ్యాయి.

ఈ భవనానికి ఆమె తండ్రి అంతిరెడ్డిగారి కేశవ రెడ్డి పేరు పెట్టారు. భవన నిర్మాణాకి ఆమె రూ.60 లక్షలు వెచ్చించారు. సోమవారం భవనాన్ని ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు. గ్రామస్థులు పాల్గొన్నారు. మాధవి రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+