జాబ్ పేరుతో రేప్: మ్యారేజ్ నిర్వాహకుడి నిర్వాకం

ఇతని కార్యాలయం స్థానిక భరత్ నగర్‌లో ఉంది. పేపర్‌లో ఉద్యోగ ప్రకటన చూసిన బాధితురాలి తల్లి దానిని తన కూతురుకు చూపించి దరఖాస్తు చేసుకోమని సూచించింది. పదిహేడేళ్ల ఆ అమ్మాయి ఫోన్‌లో నిందితుడిని సంప్రదించింది. ఫోన్ ద్వారానే ఆమెను ప్రశ్నించిన అతను ఏప్రిల్ 13వ తేదిన ఉద్యోగంలో జాయిన్ కావాలని సూచించాడు.
అతను సూచించినట్లుగానే అమ్మాయి 13న కార్యాలయానికి వెళ్లింది. తనను ఆర్తి చౌక్‌లో కలవాలని ఆమెకు అతను సూచించాడు. అక్కడ తనను కలిసిన ఆమెను నిందితుడు తన కారులో జోధాన్ గ్రామానికి తీసుకు వెళ్లాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమెను నిందితుడు బెదిరించాడు.
ఆమెను వెస్టెండ్ మాల్ వద్ద వదిలి పెట్టాడు. తిరిగి తన ఇంటికి వెళ్లిన బాధిత అమ్మాయి విషయాన్ని తన తల్లికి చెప్పింది. వైద్య పరీక్షలలో ఆమె అత్యాచారానికి గురైనట్లుగా తేలింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆ అమ్మాయికి రూ.5వేల జీతం ఇస్తానని చెప్పాడని పోలీసులు చెబుతున్నారు. అతను డ్రగ్స్‌కు బానిస అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications