ట్రైనీ నన్ కిడ్నాప్, వారం రోజులు ముగ్గురు గ్యాంగ్ రేప్

Trainee nun gang-raped, 2 arrested
బరంపూర్: శిక్షణలో ఉన్న ఓ సన్యాసి(నన్)ని పైన ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని కందమాల్ జిల్లాలో జరిగింది. 28 ఏళ్ల ఆ సన్యాసినిని కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితుల ఫిర్యాదుతో బలిగుడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం ఒడిషాలోని గంజామ్ జిల్లా బెర్హంపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 5న కిడ్నాప్ అయన మహిళను వారం రోజులపాటు కిడ్నాపర్లు అత్యాచారం చేసి 11న అదే రైల్వే స్టేషన్‌లో విడిచి పెట్టారు.

మంజపంక గ్రామానికి చెందిన ఆమె చెన్నైలో నన్‌గా శిక్షణ పొందుతోంది. తల్లి ఆరోగ్యం బాగా లేదని ఓ మహిళ ఫోన్ చేసి చెప్పడంతో చెన్నై నుండి ఇంటికి బయలుదేరింది. బెర్హంపూర్ రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత కిడ్నాప్‌కు గురైంది. కిడ్నాపర్లలో ఇద్దరు బాధితురాలి గ్రామానికే చెందిన బంధువులే. వారిద్దరిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

మరొకరి కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్పారు. బాధితురాలికి ఫోన్ చేసిన మహిళ కోసం కూడా గాలిస్తున్నారు. ఇదిలావుంటే బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్‌కెసిజి మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించగా, కుటుంబ కక్ష్యల నేపథ్యంలో ఇది జరిగినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions