బాలికపై రేప్, ఆపై హత్య: వికలాంగురాలిపై వృద్ధుల రేప్

ఈ సంఘటనకు పాల్పడిన గిరిని ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామం వద్ద తాగి తిరుగుతుండగా గ్రామస్థులు గుర్తించి చితికబాదారు. అప్పటికే సమాచారం అందుకున్న సిఐ రామ్‌కుమార్ నేతృత్వంలోని ఏర్పేడు ఎస్‌ఐ విక్రమ్ బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లాలో పద్నాలుగేళ్ళ బాలికపై ఇద్దరు వృద్దులు అత్యాచారం చేశారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలిపై ఈ అఘాయత్యం జరిగింది. ఆ బాలిక ప్రతిరోజూ తన సహ విద్యార్థులతో కలిసి బడికి వెళ్తూ మధ్యాహ్నం భోజనం చేసి వచ్చేది. ఆ బాలికపై కన్నేసిన ఇదే గ్రామానికి చెందిన చిగురు రాంరెడ్డి (70), గొర్ల రాజయ్య (65) మాయమాటలు చెప్పి కామవాంఛ తీర్చుకున్నారు.
బాలిక ఇంటిముందు నుండి వెళ్తుండగా చిగురు రాంరెడ్డి ఈనెల 7న ఇంట్లోకి మాయమాటలు చెప్పి ఇంట్లోకి పిలిచి అత్యాచారం జరిపాడు. 9న గొర్ల రాజయ్య అనే కామాంధుడు తన ఇంటి ముందునుండి వెళ్తున్న ఆ బాలిక ఇంట్లోకి పిలిచి పాడుచేశాడు. బాధితురాలు జరిగిందంతా తల్లికి తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి గ్రామస్థుల సహకారంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, వైద్య పరీక్షల నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించా రు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications