మత్తుపానియం ఇచ్చి మలేషియన్ మహిళపై రేప్
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని అందాలను తిలకించేందుకు వచ్చిన ఓ మలేషియన్ మహిళా పర్యాటకురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు జరిపి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
నిందితుడు(30) భిల్వారాకు ప్రాంతానికి చెందినవాడని డిసిపి అమన్‌దీప్ సింగ్ తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం తాను జైపూర్ వచ్చానని, అక్కడ అతడిని కలిసిన తర్వాత ఇద్దరం కలిసి ఓ ఫైవ్ స్టార్ హోటళ్లో భోజనం చేశామని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

అక్కడి నుంచి నిందితుడు తనను దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, తనకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి కారులోనే అత్యాచారం చేసినట్లు తెలిపింది. తర్వాత తనను హోటల్ ముందు వదిలేశాడని చెప్పింది.
స్పృహలోకి వచ్చిన తర్వాత తాను పోలీసులను ఆశ్రయించినట్లు బాధిత మహిళ తెలిపింది. కాగా, కేసు నమోదు చేసుకున్న మూడు గంటల వ్యవధిలోనే విస్తృతంగా గాలించిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications