సోదరుడ్ని చితకబాది బాలికపై సామూహిక అత్యాచారం

Raipur: Minor girl allegedly gang-raped by five men
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జాష్‌పూర్ జిల్లాలోని ఘోఘార్డి గ్రామంలో దారుణం జరిగింది. ఓ గిరిజన బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 2వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోదరిపై జరుగుతున్న దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె సోదరుడిపై దుండగులు దాడికి దిగారు.

పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 2వ తేదీని బాధితురాలు తన అన్నతో కలిసి వారపు సంతకు వెళ్లింది. వారిద్దరూ తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో నిందితులు వారిని అడ్డగించారు. తన సోదరిని అపహరించేందుకు ప్రయత్నించిన యువకులను అడ్డుకోవడంతో వారు అతన్ని చితకబాదారు. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. తర్వాత అతన్ని ఓ గుంటలో పడేశారు.

అనంతరం బాలికను బలవంతంగా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా ఆమెపై దారుణానికి ఒడిగట్టారు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురి చేసిన నిందితులు, బాధితురాలిని తెల్లవారుజామున వదిలిపెట్టారు.

ఇంటికి చేరుకున్న బాలిక, జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులైన శ్యాం నాగవంశి, పింటు పైక్రా, మున్నాకుమార్, చక్కు ఉరావ్, కనెల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్యాం, మున్నా, పింటూలను అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, తీవ్ర గాయాలపాలైన బాధితురాలి సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions