ఢిల్లీలో ఆరేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

అత్యాచారం కింద కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదో కారణం చెప్పి బాలికను ఆ యువకుడు ఇంటి పైభాగానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు.
జరిగిన విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆ బాలికను అతను బెదిరించాడు. అయితే, బాలిక తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. తదుపరి దర్యాప్తును పోలీసులు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications